వీటిలో పెట్టుబడి పెడితే.. రిటైర్మైంట్ తర్వాత హ్యాపీ లైఫ్. ఎందులో లేని విధంగా 8.2 శాతం వడ్డీ

Post Office Schemes: రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు.

Mokshith
Published on: 11 July 2026 11:42 AM IST
Post Office
X

వీటిలో పెట్టుబడి పెడితే.. రిటైర్మైంట్ తర్వాత హ్యాపీ లైఫ్. ఎందులో లేని విధంగా 8.2 శాతం వడ్డీ

Post Office Schemes: రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా స్థిరమైన ఆదాయం రావాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీస్ ద్వారా పలు చిన్న పొదుపు పథకాలను అందిస్తోంది. వాటిలో పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.

POMIS, SCSSలో ఎంత వరకు పెట్టుబడి పెట్టవచ్చు?

ఈ రెండు పథకాలలో కూడా కనీసం రూ.1,000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. అయితే గరిష్ఠ పెట్టుబడి పరిమితి మాత్రం వేర్వేరుగా ఉంటుంది.

* పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)లో ఒకే వ్యక్తి పేరుతో ఖాతా తెరిస్తే గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ అయితే రూ.15 లక్షలు వరకు పెట్టుబడి పెట్టవచ్చు.

* సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)లో గరిష్ఠంగా రూ.30 లక్షలు వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ పథకం ప్రధానంగా 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారి కోసం రూపొందించారు. కొన్ని ప్రత్యేక నిబంధనల ప్రకారం 55 నుంచి 60 ఏళ్ల మధ్య రిటైర్ అయిన వారు కూడా ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

ఏ స్కీమ్‌లో ఎక్కువ వడ్డీ వస్తుంది? ఎంత ఆదాయం పొందొచ్చు?

ఈ రెండు పథకాల మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. కానీ వడ్డీ రేటు, వడ్డీ చెల్లింపు విధానం మాత్రం భిన్నంగా ఉంటుంది.

* POMISలో ప్రస్తుతం ఏడాదికి 7.4 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో వచ్చే వడ్డీ మొత్తాన్ని ప్రతి నెలా ఖాతాలో జమ చేస్తారు. జాయింట్ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సుమారు రూ.9,250, అంటే ఏడాదికి రూ.1.11 లక్షలు ఆదాయం పొందవచ్చు.

* SCSSలో ప్రస్తుతం ఏడాదికి 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. అయితే ఇందులో వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి చెల్లిస్తారు. గరిష్ఠంగా రూ.30 లక్షలు పెట్టుబడి పెడితే నెలకు సగటున రూ.20,500, అంటే ఏడాదికి సుమారు రూ.2.46 లక్షలు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

పన్ను మినహాయింపులో ఏ స్కీమ్‌కు ఎక్కువ ప్రయోజనం?

పన్ను ప్రయోజనాల విషయంలో SCSSకు స్పష్టమైన ఆధిక్యం ఉంది. POMISలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్నులో ఎలాంటి మినహాయింపు ఉండదు. అలాగే ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపై కూడా పన్ను వర్తిస్తుంది. అయితే SCSSలో పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.

ముందుగానే డబ్బులు తీసుకోవచ్చా?

ఈ రెండు పథకాలలో కూడా 5 సంవత్సరాల మెచ్యూరిటీ పూర్తికాకముందే డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. అయితే అందుకు ప్రభుత్వం నిర్ణయించిన పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఖాతా తెరిచిన ఒక సంవత్సరం పూర్తికాకముందు ఈ రెండు స్కీమ్స్‌లో ఏదీ మూసివేయడానికి అవకాశం ఉండదు.

ఎవ‌ర‌కి ఏ స్కీమ్ బెస్ట్‌.?

ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువ వడ్డీ, రూ.30 లక్షల వరకు పెట్టుబడి అవకాశం, పన్ను మినహాయింపు వంటి ప్రయోజనాల కారణంగా సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) రిటైర్డ్ వ్యక్తులకు మరింత అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆదాయం రావాలని కోరుకునే వారు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS)ను ఎంచుకోవచ్చు. అలాగే తమ అవసరాలను బట్టి కొంత మొత్తాన్ని SCSSలో, మరికొంత మొత్తాన్ని POMISలో పెట్టుబడి పెట్టి సమతుల్యంగా ఆదాయం పొందే అవకాశమూ ఉంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story