IPO Listings: జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు సునామీ తర్వాత.. ఈ వారంలో లిస్ట్ కానున్న కంపెనీలు ఇవే..!

IPO Listings: జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు ఐపీఓ ముగిసిన తర్వాత ఈ వారం మార్కెట్‌లో 13 కంపెనీల లిస్టింగ్‌లు.

Gagan kumar
Published on: 2 Nov 2026 7:46 AM IST
IPO Listings
X

IPO Listings: జియో ప్లాట్‌ఫామ్స్ రికార్డు సునామీ తర్వాత.. ఈ వారంలో లిస్ట్ కానున్న కంపెనీలు ఇవే..!

Vedant Poly Fabs: గత అక్టోబర్‌లో దాదాపు కోటికి పైగా బిడ్లతో దలాల్ స్ట్రీట్‌ను ఊపేసిన జియో ప్లాట్‌ఫామ్స్ హంగామా ముగిసింది. దశాబ్ద కాలంలోనే అత్యంత భారీగా వచ్చిన ఈ మెగా ఐపీఓ తర్వాత ప్రైమరీ మార్కెట్ కాస్త స్లో అయింది. అయితే, కొత్తగా వచ్చే పబ్లిక్ ఇష్యూల సంఖ్య తగ్గినప్పటికీ, ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్లు పూర్తి చేసుకున్న కంపెనీల లిస్టింగ్‌ల హడావుడి ఈ వారం ఇన్వెస్టర్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

రూ. 30,188 కోట్ల నిధుల సేకరణ లక్ష్యంతో అడుగుపెట్టిన ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ భారతదేశ చరిత్రలోనే అతిపెద్దదిగా నిలిచింది.

ఇష్యూ ధర: రూ. 1,119

లిస్టింగ్: 21.36% ప్రీమియంతో రూ. 1,358 వద్ద సంచలన అరంగేట్రం చేసింది.

మొత్తం బిడ్లు: ఏకంగా రూ. 4.9 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలవగా, 22 రెట్లకు పైగా సబ్‌స్క్రయిబ్ అయి రికార్డు సృష్టించింది.

ఈ వారం పబ్లిక్ సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తున్న ఏకైక కొత్త ఐపీఓ చిన్న, మధ్య తరహా సంస్థ అయిన వేదాంత్ పాలీ ఫ్యాబ్స్.

ఆఫర్ వ్యవధి: నవంబర్ 2 నుంచి నవంబర్ 4 వరకు

మొత్తం ఇష్యూ పరిమాణం: రూ. 56.68 కోట్లు

ధరల శ్రేణి : షేరుకు రూ. 88 – రూ. 94

ఇష్యూ వివరాలు: రూ. 51.01 కోట్ల విలువైన కొత్త షేర్లు, రూ. 5.67 కోట్ల ఆఫర్ ఫర్ సేల్.

కనీస పెట్టుబడి: రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 2,400 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం కనీసం రూ. 2,25,600 పెట్టుబడి అవసరం.

ఈ వారం బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలలో ఏకంగా 13 కంపెనీలు తమ షేర్లను లిస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి.

బాంబే కోటెడ్ అండ్ స్పెషల్ స్టీల్స్ : రూ. 183.06 కోట్ల విలువైన ఈ ఇష్యూ అక్టోబర్ 29న ప్రారంభమై నవంబర్ 2తో ముగుస్తుంది. నవంబర్ 3న షేర్ల కేటాయింపు, నవంబర్ 5న మార్కెట్‌లో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం లిస్ట్ కానున్న ఏకైక మెయిన్‌బోర్డ్ ఐపీఓ ఇదే.

నవంబర్ 2: EAAA ఇండియా ఆల్టర్నేటివ్స్

నవంబర్ 3: బిఎల్ఎస్ పాలిమర్స్, ఎస్ఎఫ్‌సి ఎన్విరాన్‌మెంటల్ టెక్నాలజీస్, విస్కాన్ ఇండస్ట్రీస్

నవంబర్ 4 - 5 మధ్య : అంటాలా ఇండస్ట్రీస్, మాక్స్ వెల్ ఇంజనీరింగ్ సొల్యూషన్స్, జాన్సన్‌క్యాబ్ ఎలక్ట్రికల్స్, వెక్ట్రాస్ ఎన్‌ప్రోకాన్, హెచ్‌జిఎస్ (ఇండియా), ఎమ్ కే సన్స్ ఫైన్ జ్యువెల్స్, అజ్వా ప్రాజెక్ట్స్, కార్వర్ రోబోవెల్డ్. జియో ధాటికి తాత్కాలికంగా నెమ్మదించిన ప్రైమరీ మార్కెట్‌లో, ఈ 13 కంపెనీల లిస్టింగ్ ముగింపు తర్వాతే మళ్లీ కొత్త మెయిన్‌బోర్డ్ ఐపీఓల పర్వం ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.