RBI: క్రెడిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై 5 రోజుల్లోనే.!

RBI: క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ వాడుతున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

Ravi
By Ravi
Published on: 25 Jun 2026 9:36 AM IST
RBI
X

RBI: క్రెడిట్ కార్డు యూజర్లకు ఆర్బీఐ గుడ్ న్యూస్.. ఇకపై 5 రోజుల్లోనే.!

RBI: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ పేమెంట్స్, క్రెడిట్ కార్డుల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూ అమాయక ప్రజల ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు. ఇలా క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా సైబర్ మోసాలకు గురవుతున్న యూజర్లకు ఉపశమనం కలిగించేలా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. మోసపోయిన బాధితులకు అతి త్వరగా న్యాయం జరిగేలా బ్యాంకుల కోసం కొన్ని కఠిన నిబంధనలను సిద్ధం చేసింది.

ఆర్బీఐ కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం.. ఎవరైనా కస్టమర్ సైబర్ మోసంపై బ్యాంకుకు ఫిర్యాదు చేసిన పక్షంలో, కేవలం 5 రోజుల్లోగా ఆ డబ్బును బ్యాంకులు తప్పనిసరిగా బాధితుడికి తిరిగి చెల్లించాల్సిందే. ఈ అమౌంట్‌ను 'షాడో రివర్సల్' లేదా 'ప్రావిజనల్ క్రెడిట్' రూపంలో ఆయా ఖాతాదారుల కార్డులో జమ చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల మోసపోయిన వినియోగదారులు తమ డబ్బు కోసం నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిరిగే కష్టాలు పూర్తిగా తప్పుతాయి.

అంతేకాకుండా, క్రెడిట్ కార్డు ద్వారా రూ. 500 కు మించి ఏ చిన్న ట్రాన్సాక్షన్ జరిగినా కూడా వెంటనే యూజర్‌కు మొబైల్ మెసేజ్ పంపాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది. దీనిద్వారా ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే ఖాతాదారుడు వెంటనే అప్రమత్తమై కార్డును బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. కస్టమర్ల ఆర్థిక భద్రత కోసం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలన్నీ 2027 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా కచ్చితంగా అమల్లోకి రానున్నాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story