Loan: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.! త్వరలోనే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు..

Loan: ఫ్లోటింగ్ రేట్ లోన్లను నిర్ణయించే రిఫరెన్స్ రేటునే బెంచ్‌మార్క్ అంటారు. ఆర్‌బీఐ సిద్ధం చేసిన రూల్స్‌కు ఆమోదం లభిస్తే 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Ravi
By Ravi
Published on: 18 Aug 2026 10:00 AM IST
Loan
X

Loan: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.! త్వరలోనే ఆర్‌బీఐ కొత్త నిబంధనలు.. పూర్తి వివరాలు..

Loan: ఫ్లోటింగ్ రేట్ లోన్లను నిర్ణయించే రిఫరెన్స్ రేటునే బెంచ్‌మార్క్ అంటారు. ఆర్‌బీఐ సిద్ధం చేసిన రూల్స్‌కు ఆమోదం లభిస్తే 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణాలు, ముఖ్యంగా ఫ్లోటింగ్ రేట్ లోన్లకు సంబంధించి బెంచ్‌ మార్క్ అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఫ్లోటింగ్ రేట్ లోన్లను ఖరారు చేసే రిఫరెన్స్‌ రేటునే బెంచ్‌ మార్క్ అని పిలుస్తారు. ఈ బెంచ్‌ మార్క్‌తో పాటు బ్యాంక్ మార్జిన్‌ను కలిపితేనే తుది వడ్డీ రేటు ఎంత అనేది ఖరారవుతుంది. ఈ రేట్లలో మార్పులు వస్తే అది నేరుగా కస్టమర్ చెల్లించే వడ్డీ రేటు అలాగే ఈఎంఐలపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఒకవేళ లోన్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న బెంచ్‌ మార్క్ గనుక రద్దు అయితే కస్టమర్‌పై ఎలాంటి అదనపు ఆర్థిక భారం పడకుండా బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలి. అటువంటి సందర్భాలలో బ్యాంకులు స్వయంగా కస్టమర్ల లోన్లను కొత్త బెంచ్‌ మార్క్‌కు మార్చాల్సి ఉంటుంది. దీనివల్ల రుణ గ్రహీతలకు ఎలాంటి నష్టం జరగకుండా రక్షణ లభిస్తుంది. ఈ నిబంధనలకు సంబంధించి ఆర్‌బీఐ ప్రత్యేక మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది.

ఈ కొత్త నిబంధనలకు త్వరలోనే అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది. ఒకసారి ఆమోదం లభిస్తే రాబోయే 2027వ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఇవి పూర్తిగా అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఆన్‌లైన్ లేదా వ్యక్తిగత రుణాలు తీసుకునే ప్రతి ఒక్కరూ ఈ మార్పుల గురించి అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. బ్యాంకింగ్ రంగంలో పారదర్శకతను పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకుంటున్న ఈ చర్యలు కస్టమర్‌లకు ఎంతగానో ఉపయోగపడతాయి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story