Fact Check: పాత నోట్ల మార్పిడిపై కేంద్రం క్లారిటీ: ఆ వార్తలు నమ్మకండి.. పీఐబీ వార్నింగ్!
Fact Check: రద్దయిన పాత రూ.500, రూ.1000 నోట్లను మార్చుకోవడానికి ఆర్‌బీఐ కొత్త గైడ్‌లైన్స్ ఇచ్చిందన్న వార్తలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారమని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ తేల్చిచెప్పింది.
Fact Check: పాత నోట్ల మార్పిడిపై కేంద్రం క్లారిటీ: ఆ వార్తలు నమ్మకండి.. పీఐబీ వార్నింగ్!
Fact Check: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రద్దయిన పాత కరెన్సీ నోట్ల మార్పిడికి సంబంధించి వైరల్ అవుతున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాత నోట్ల మార్పిడికి మళ్ళీ అనుమతినిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేసిందన్న ప్రచారాన్ని పీఐబీ (PIB) ఫ్యాక్ట్‌చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది.
ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు మరియు ఫోటోలు పూర్తిగా అవాస్తవమని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్‌బీఐ అటువంటి నిబంధనలు ఏవీ జారీ చేయలేదని పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించింది. కచ్చితమైన సమాచారం కోసం ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించింది.
అప్రమత్తంగా ఉండండి:
ఏవైనా అనుమానాస్పద మెసేజ్‌లు, వీడియోలు ప్రజల దృష్టికి వస్తే వెంటనే పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగానికి పంపాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
వాట్సప్ నంబర్: +91 8799711259
ఈ-మెయిల్: [email protected]
2016 నవంబర్‌లో కేంద్రం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రూ.2000 నోట్లను కూడా చలామణి నుంచి ఉపసంహరించుకుంది. అప్పటి నుంచి పాత నోట్ల మార్పిడికి ప్రభుత్వం ఎలాంటి కొత్త అవకాశాలు కల్పించలేదు.




