Recurring Deposit: ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా.? ఎక్కువ వడ్డీ ఎందులో వస్తుందో తెలుసా?
Recurring Deposit: ప్రతి నెల కొంత మొత్తాన్ని పొదుపు చేసి, భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవాలనుకునేవారికి రికరింగ్ డిపాజిట్ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
Recurring Deposit: ఆర్డీ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా.? ఎక్కువ వడ్డీ ఎందులో వస్తుందో తెలుసా?
Recurring Deposit:
ఎస్‌బీఐలో ఎంత వడ్డీ వస్తుంది?
ఎస్‌బీఐలో 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు RD ఖాతాను కొనసాగించవచ్చు. నెలకు కనీసం రూ.100తో RD ప్రారంభించవచ్చు. కాలవ్యవధిని బట్టి వడ్డీ రేటు మారుతుంది. ఒక సంవత్సరం ఆర్డీపై 6.80 శాతం వడ్డీ లభిస్తుంది.
అదే రెండేళ్ల కాలానికి అయితే 7 శాతం, మూడు నుంచి నాలుగేళ్ల సమయానికి 6.75 శాతం వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల RDపై 6.50% వడ్డీ పొందొచ్చు. గరిష్టంగా 400 రోజుల ప్రత్యేక కాలవ్యవధిపై 7.10 శాతం వడ్డీ పొందొచ్చు. SBIలో RDపై ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది. అంటే అవసరమైన సమయంలో RD ఆధారంగా కొంత మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది.
ఐసీఐసీఐ, పీఎన్‌బీ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇలా..
ఐసీఐసీఐ బ్యాంకులో 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు RD ఖాతా తెరవవచ్చు. సాధారణ కస్టమర్లకు కాలవ్యవధిని బట్టి వడ్డీ రేటు 4.50% నుంచి 6.50% వరకు ఉంటుంది. 3 నుంచి 5 సంవత్సరాల RDపై 6.50% వడ్డీ లభిస్తుంది. అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు 7.10% వరకు వడ్డీ అందుతుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ విషయానికొస్తే నెలకు రూ.100తో RD ప్రారంభించవచ్చు. 6 నెలల నుంచి 120 నెలల వరకు కాలవ్యవధిని ఎంచుకోవచ్చు. నెలకు గరిష్ఠంగా రూ.25 లక్షల వరకు వాయిదా మొత్తాన్ని నిర్ణయించుకునే అవకాశం ఉంది. PNBలో RD ఆధారంగా రుణ సదుపాయం కూడా ఉంటుంది.
మెచ్యూరిటీకి ముందే RD మొత్తాన్ని తీసుకుంటే నిబంధనల ప్రకారం 1% వరకు పెనాల్టీ వర్తించే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లకు అదనపు వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. 80 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా ప్రత్యేక వడ్డీ ప్రయోజనాలు ఉంటాయి.
పోస్టాఫీస్ RDపై 6.7% వడ్డీ.. రూ.10 లక్షలకు నెలకు ఎంత?
పోస్టాఫీస్ RDపై జూలై-సెప్టెంబర్ 2026 త్రైమాసికంలో 6.7% వార్షిక వడ్డీ లభిస్తోంది. ఇందులో కేవలం రూ.100తోనే RD ఖాతా ప్రారంభించవచ్చు. పెట్టుబడిపై గరిష్ఠ పరిమితి లేదు. రూ.10 లక్షల లక్ష్యాన్ని చేరుకోవాలంటే కాలవ్యవధిని బట్టి ప్రతి నెలా పెట్టుబడి మొత్తం మారుతుంది.
ఉదాహరణకు ఒక ఏడాదికి నెలకు రూ. రూ.80,503, 5 ఏళ్లకు అయితే నెలకు సుమారు రూ.14,087, 10 సంవత్సరాలకు అయితే నెలకు సుమారు రూ.6,082 చెల్లించాల్సి ఉంటుంది.
అయితే RD ఎంచుకునే ముందు కేవలం వడ్డీ రేటును మాత్రమే చూడకూడదు. కాలవ్యవధి, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు, పెనాల్టీ, పన్ను ప్రభావం, సీనియర్ సిటిజన్లకు లభించే అదనపు వడ్డీ వంటి అంశాలను కూడా పరిశీలించాలి. మీ ఆర్థిక లక్ష్యానికి సరిపోయే కాలవ్యవధి, నెలవారీ వాయిదాను ఎంచుకోవడం ముఖ్యం.




