Rupee vs Dollar: పెరిగిన చమురు ధరల కారణంగా రూపాయి పతనం
Rupee vs Dollar: క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు తగ్గి 96.44 వద్ద ముగిసింది.
Rupee vs Dollar: పెరిగిన చమురు ధరల కారణంగా రూపాయి పతనం
Rupee vs Dollar: గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత భారతీయ రూపాయిపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. సోమవారం ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 14 పైసలు క్షీణించి 96.44 వద్ద ముగిసింది.
ఉద్రిక్తతల దెబ్బకు రూపాయి విలవిల:
అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ (రాబడులు) పెరగడమే రూపాయి పతనానికి ప్రధాన కారణమని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి 96.53 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. రోజంతా 96.35 నుండి 96.53 శ్రేణిలో కదలాడిన రూపాయి, చివరకు క్రితం ముగింపు (96.30) కంటే 14 పైసలు తగ్గి 96.44 వద్ద స్థిరపడింది.
విశ్లేషకులు ఏమంటున్నారంటే?
ముడి చమురు ధరల ధాటికి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కరెన్సీలపై ఒత్తిడి పెరిగిందని ఎల్డిఎఫ్సి (HDFC) సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ పర్మార్ పేర్కొన్నారు. ప్రస్తుతం USD-INR స్పాట్ జతకి 96.50 వద్ద నిరోధం (Resistance), 95.80 వద్ద కీలక మద్దతు (Support) లభిస్తోందని తెలిపారు.
మరోవైపు, దౌత్యపరమైన చర్చలు సాగడం మరియు తక్కువ స్థాయిల వద్ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సకాలంలో జోక్యం చేసుకోవడం వల్ల రూపాయి మరింత దారుణంగా పడిపోకుండా రక్షణ లభించిందని మిరే అసెట్ షేర్‌ఖాన్ విశ్లేషకుడు అనుజ్ చౌదరి తెలిపారు. రాబోయే రోజుల్లో USD-INR స్పాట్ ధర 96.10 నుండి 96.70 శ్రేణిలో కదిలే అవకాశముందని అంచనా వేశారు.




