Saving Scheme: 5 ఏళ్ల‌లో రూ.6,73,551 వ‌డ్డీ.. ఇంత‌కంటే బెస్ట్ ప్లాన్ మ‌రొక్క‌టి ఉండ‌దు

Saving Scheme: షేర్ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గాల కోసం చూస్తున్నారు.

Mokshith
Published on: 19 May 2026 2:17 PM IST
Saving Scheme
X

Saving Scheme: 5 ఏళ్ల‌లో రూ.6,73,551 వ‌డ్డీ.. ఇంత‌కంటే బెస్ట్ ప్లాన్ మ‌రొక్క‌టి ఉండ‌దు

Saving Scheme: షేర్ మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా తీవ్ర ఒడిదుడుకులు కొనసాగుతున్నాయి. దీంతో చాలా మంది పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తున్నారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) స్కీమ్ మంచి ఎంపికగా చెప్పొచ్చు.

NSC స్కీమ్ అంటే ఏమిటి?

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ అంటే కేంద్ర ప్రభుత్వం నిర్వహించే చిన్న పొదుపు పథకం. ఇది పోస్టాఫీస్ ద్వారా అందుబాటులో ఉంటుంది. దేశంలోని ఏ పోస్టాఫీస్‌లోనైనా కనీసం రూ.1000తో ఖాతా ప్రారంభించవచ్చు. ఈ పథకం గడువు 5 సంవత్సరాలు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై ప్రభుత్వం సంవత్సరానికి 7.7 శాతం వడ్డీ అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి సంవత్సరం చక్రవడ్డీ విధానంలో లెక్కిస్తారు.

పెట్టుబడిపై ట్యాక్స్ ప్రయోజనాలు

NSC స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వారికి ఆదాయపన్నులో కూడా మినహాయింపు లభిస్తుంది. పాత ట్యాక్స్ విధానాన్ని ఎంచుకున్నవారికి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద రూ.1.5 లక్షల వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది.

అయితే ఈ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీ మొత్తంపై “ఇతర ఆదాయం” కింద పన్ను వర్తిస్తుంది. అయినప్పటికీ భద్రతతో పాటు ట్యాక్స్ సేవింగ్ ప్రయోజనం ఉండటంతో చాలా మంది ఈ స్కీమ్‌ను ఎంచుకుంటున్నారు.

ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టొచ్చు

ఈ స్కీమ్‌లో పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. పెట్టుబడిదారులు తమ సౌకర్యం మేరకు డబ్బు జమ చేయవచ్చు. రూ.100, రూ.500, రూ.1000, రూ.5000, రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని కూడా పెట్టుబడిగా పెట్టే అవకాశం ఉంది. ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడి పెడితే, గడువు ముగిసే సమయానికి మంచి రాబడి పొందవచ్చు.

రూ.15 లక్షలు పెడితే ఎంత వస్తుంది?

ఈ స్కీమ్‌లో ఒకేసారి రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, 5 ఏళ్ల తర్వాత భారీ మొత్తం అందుతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7.7 శాతం వార్షిక చక్రవడ్డీ ప్రకారం లెక్కిస్తే, గడువు పూర్తయ్యే సమయానికి మొత్తం రూ.21,73,551 వస్తాయి. అంటే పెట్టిన రూ.15 లక్షలకు అదనంగా రూ.6,73,551 వడ్డీ రూపంలో లభిస్తుంది.

సురక్షిత పెట్టుబడిగా NSCకు పెరుగుతున్న ఆదరణ

షేర్ మార్కెట్ రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి కోరుకునే వారికి NSC స్కీమ్ మంచి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ భరోసా ఉండటంతో పెట్టుబడి భద్రంగా ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత కూడా కొనసాగించాలని భావిస్తే, పోస్టాఫీస్ కొత్త సర్టిఫికెట్ జారీ చేస్తుంది. దీర్ఘకాలికంగా సురక్షితంగా డబ్బు పెంచుకోవాలనుకునేవారికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story