ఎస్‌బీఐ నుంచి ప్ర‌త్యేక ఎఫ్డీ ప‌థ‌కం.. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా.?

SBI Amrit Vrishti Scheme: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేకంగా 444 రోజుల కాలపరిమితితో 'అమృత్ వృష్టి' పేరుతో FD పథకాన్ని అందిస్తోంది.

Mokshith
Published on: 11 Nov 2026 3:26 PM IST
SBI Amrit Vrishti Scheme
X

ఎస్‌బీఐ నుంచి ప్ర‌త్యేక ఎఫ్డీ ప‌థ‌కం.. రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా.?

SBI Amrit Vrishti Scheme: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రత్యేకంగా 444 రోజుల కాలపరిమితితో 'అమృత్ వృష్టి' పేరుతో FD పథకాన్ని అందిస్తోంది. ఈ పథకంలో సాధారణ ఖాతాదారులతో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు ఉన్నాయి.

SBI అమృత్ వృష్టి పథకం అంటే ఏంటి.?

SBI అందిస్తున్న ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకమే అమృత్ వృష్టి. ఇందులో డబ్బులు జమ చేస్తే 444 రోజుల తర్వాత మెచ్యూరిటీ మొత్తం పొందవచ్చు. సాధారణ FDలతో పోలిస్తే ఈ ప్రత్యేక పథకంలో కొంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ముఖ్యంగా తమ దగ్గర ఉన్న డబ్బును నిర్ణీత కాలం పాటు భద్రంగా ఉంచి స్థిరమైన రాబడి పొందాలనుకునే వారికి ఇది ఒక ఎంపిక. అయితే పెట్టుబడి పెట్టే ముందు ఈ పథకం అందుబాటులో ఉన్న కాలపరిమితి, తాజా నిబంధనలను బ్యాంకులో తెలుసుకోవాలి.

సాధారణ, సీనియర్ సిటిజన్లకు వడ్డీ ఎంతంటే?

ఈ పథకంలో వయసును బట్టి వేర్వేరు వడ్డీ రేట్లను అందిస్తున్నారు. సాధారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు అధిక వడ్డీ లభిస్తుంది. సాధారణ పౌరులకు 6.45 శాతం వార్షిక వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం వార్షిక వడ్డీ, 80 ఏళ్లు పైబడిన సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వార్షిక వడ్డీ ల‌భిస్తుంది. ఈ వడ్డీ రేట్ల ప్రకారం 444 రోజుల పాటు డబ్బులు డిపాజిట్ చేస్తే నిర్ణీత వడ్డీతో పాటు అసలు మొత్తం తిరిగి పొందవచ్చు.

రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే ఎంత వస్తుంది.?

ఈ పథకంలో రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో ఎంత మొత్తం వస్తుందో తెలుసుకుందాం. సాధారణ ఖాతాదారులకు 6.45 శాతం వడ్డీ ప్రకారం 444 రోజుల తర్వాత మొత్తం రూ.5,40,150 లభిస్తుంది. ఇందులో వడ్డీ రూపంలో రూ.40,150 వస్తుంది. అదే సీనియర్ సిటిజన్లు రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే 6.95 శాతం వడ్డీ ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ.5,43,380 పొందుతారు. అంటే వారికి వడ్డీ రూపంలో రూ.43,380 లభిస్తుంది.

రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే రాబడి ఎంత.?

ఒకవేళ ఈ పథకంలో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టాలని భావిస్తే సాధారణ ఖాతాదారులకు 6.45 శాతం వడ్డీ ప్రకారం 444 రోజుల తర్వాత మొత్తం రూ.10,80,300 లభిస్తుంది. అంటే వడ్డీ రూపంలో రూ.80,300 వస్తుంది. సీనియర్ సిటిజన్లకు 6.95 శాతం వడ్డీ ప్రకారం మెచ్యూరిటీ సమయంలో రూ.10,86,760 అందుతుంది. ఇందులో రూ.86,760 వడ్డీ ఉంటుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.