SBI: బ్యాంక్ ఖాతాదారులకు షాక్..ట్రాన్సాక్షన్లపై ఛార్జీల మోత!
SBI: ఎస్‌బీఐ BSBD ఖాతాల కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి.
SBI: బ్యాంక్ ఖాతాదారులకు షాక్..ట్రాన్సాక్షన్లపై ఛార్జీల మోత!
SBI BSBD: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు పెద్ద అలర్ట్ జారీ చేసింది. ఖాతాదారుల నగదు లావాదేవీలకు సంబంధించిన నియమ నిబంధనలలో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై పరిమితి దాటితే జేబుకు చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది.
అక్టోబర్ 1 నుంచి BSBD ఖాతాదారులు నెల మొత్తంలో కేవలం 4 సార్లు మాత్రమే ఉచితంగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంటుంది. 4 ఉచిత లావాదేవీల పరిమితి పూర్తయిన తర్వాత చేసే ప్రతి అదనపు విత్‌డ్రాపై రూ. 15 తో పాటు జీఎస్టీ కూడా వసూలు చేస్తారు.
బ్రాంచ్‌లో నగదు ఉపసంహరణ, ఏటీఎం విత్‌డ్రాలు , ఆధార్ ఆధారిత లావాదేవీలు అన్నీ ఈ 4 ఉచిత లావాదేవీల పరిధిలోకి వస్తాయి. గతంలో కూడా 4 ఉచిత నగదు లావాదేవీల తర్వాత రూ.15 ఛార్జ్ విధించేవారు. కానీ, అప్పట్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లకు ఈ పరిమితి నుంచి మినహాయింపు ఉండేది. అయితే ఈ కొత్త నిబంధనతో ఆ మినహాయింపును బ్యాంక్ పూర్తిగా తొలగించింది.
ఇకపై మీరు ఏటీఎం, బ్యాంక్ బ్రాంచ్ లేదా డిజిటల్ రూపంలో చేసే లావాదేవీలన్నీ కలిపి నెలకు 4 ఉచిత లావాదేవీల కిందకే లెక్కించబడతాయి. ఉదాహరణకు, మీరు నెలలో 2 సార్లు ఏటీఎం విత్‌డ్రా చేసి, మరో 2 సార్లు డిజిటల్ ట్రాన్స్‌ఫర్లు చేస్తే.. ఆ నెల ఉచిత పరిమితి ముగిసినట్లే. ఆ తర్వాత చేసే ప్రతీ విత్‌డ్రాపై ఛార్జీ పడుతుంది.
బ్యాంకింగ్ లావాదేవీలను ప్లాన్ చేసుకునేటప్పుడు ఈ మార్పులను గుర్తుంచుకోవడం చాలా అవసరం. అనవసర రుసుములు పడకుండా ఉండాలంటే నెలకు 4 పరిమితికి లోబడే విత్‌డ్రాలు నిర్వహించడం మంచిది.




