FD Scheme: 222 రోజుల పాటు రూ. 2 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. చేతికి ఎంత వస్తుంది.?
FD Scheme: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తోంది.
FD Scheme: 222 రోజుల పాటు రూ. 2 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే.. చేతికి ఎంత వస్తుంది.?
FD Scheme: దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) ఖాతాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు అందిస్తోంది. తక్కువ కాల వ్యవధి FDల్లో డబ్బు పెట్టాలనుకునే వారికి SBI పథకాలు మంచి అవకాశంగా మారుతున్నాయి. 222 రోజుల FD స్కీమ్ ప్రస్తుతం ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది.
SBI FDలపై ప్రస్తుతం ఎంత వడ్డీ వస్తోంది.?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు వివిధ కాల వ్యవధుల్లో FD ఖాతాలను అందిస్తోంది. డిపాజిట్ చేసే కాలాన్ని బట్టి వడ్డీ రేట్లు కూడా మారుతున్నాయి. ప్రస్తుతం 7 రోజుల నుంచి 45 రోజుల FDలకు 3.05 శాతం నుంచి 3.65 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇక 211 రోజుల నుంచి ఒక సంవత్సరం లోపు FDలపై సాధారణ ఖాతాదారులకు 5.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.40 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వరకు వడ్డీ అందిస్తోంది. దీర్ఘకాల FDల్లో అయితే 7.15 శాతం వరకు రాబడి పొందే అవకాశం ఉంది.
222 రోజుల FDలో రూ.2 లక్షలు పెడితే ఎంత వస్తుంది?
ఒక సాధారణ వ్యక్తి SBIలో 222 రోజుల FD స్కీమ్‌లో రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే, ప్రస్తుత 5.90 శాతం వడ్డీ రేటు ప్రకారం మెచ్యూరిటీ సమయంలో మొత్తం సుమారు రూ.2,07,253 లభిస్తుంది. ఇందులో అసలు పెట్టుబడి రూ.2 లక్షలు కాగా, వడ్డీ రూపంలో రూ.7,253 వస్తుంది. తక్కువ కాలంలోనే సురక్షితంగా కొంత అదనపు ఆదాయం పొందాలనుకునే వారికి ఈ FD మంచి ఎంపికగా భావిస్తున్నారు.
సీనియర్ సిటిజన్లకు ఎక్కువ ప్రయోజనం
సీనియర్ సిటిజన్లకు SBI అదనపు వడ్డీ ప్రయోజనం కల్పిస్తోంది. అదే 222 రోజుల FDలో రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే, వారికి 6.40 శాతం వడ్డీ ప్రకారం మెచ్యూరిటీ సమయంలో సుమారు రూ.2,07,875 లభిస్తుంది. ఇందులో వడ్డీ రూపంలో రూ.7,875 ఉంటుంది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకు 6.50 శాతం వడ్డీ వర్తించడంతో వారికి దాదాపు రూ.7,999 వరకు వడ్డీ వచ్చే అవకాశం ఉంది. దీంతో వృద్ధులకు FDలు మరింత లాభదాయకంగా మారుతున్నాయి.
FDల్లో పెట్టుబడి ఎందుకు మంచిదిగా భావిస్తున్నారు?
మార్కెట్‌లో రిస్క్ లేకుండా స్థిరమైన ఆదాయం కోరుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పటికీ నమ్మకమైన పెట్టుబడిగా కొనసాగుతున్నాయి. స్టాక్ మార్కెట్‌లా హెచ్చుతగ్గులు లేకుండా ముందుగానే ఎంత రాబడి వస్తుందో తెలుసుకునే అవకాశం ఉండటం FDల ప్రత్యేకత. ముఖ్యంగా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కుటుంబ అవసరాల కోసం సురక్షిత పెట్టుబడులు కోరుకునే వారు FDలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. SBIలాంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పెట్టుబడి పెడితే భద్రతపై కూడా విశ్వాసం ఎక్కువగా ఉంటుంది.




