లక్ష రూపాయల పర్సనల్ లోన్ తీసుకుంటే.. నెలకు ఎంత ఈఎంఐ కట్టాలి.?
అత్యవసర ఖర్చుల కోసం ఎలాంటి తనఖా లేకుండా బ్యాంకులు పర్సనల్ లోన్ అందిస్తాయి. ఈ రుణాలపై వడ్డీ రేట్లు 10 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎస్‌బీఐ బ్యాంకులో రూ.1 లక్ష లోన్ తీసుకుంటే 1 నుంచి 5 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ EMI ఎంత? మొత్తం వడ్డీ ఎంత చెల్లించాలి? తెలుసుకుందాం.
లక్ష రూపాయల పర్సనల్ లోన్ తీసుకుంటే.. నెలకు ఎంత ఈఎంఐ కట్టాలి.?
Personal Loan: అత్యవసర ఖర్చుల కోసం ఎలాంటి తనఖా లేకుండా బ్యాంకులు పర్సనల్ లోన్ అందిస్తాయి. ఈ రుణాలపై వడ్డీ రేట్లు 10 శాతం నుంచి ప్రారంభమవుతాయి. ఎస్‌బీఐ బ్యాంకులో రూ.1 లక్ష లోన్ తీసుకుంటే 1 నుంచి 5 ఏళ్ల కాలపరిమితికి నెలవారీ EMI ఎంత? మొత్తం వడ్డీ ఎంత చెల్లించాలి? తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎలా నిర్ణయిస్తారు?
ఎస్బీఐలో పర్సనల్ లోన్ వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభమైనప్పటికీ ప్రతి ఒక్కరికీ ఇదే రేటు వర్తించదు. రుణం తీసుకునే వ్యక్తి ఆర్థిక పరిస్థితి, ఉద్యోగం, నెలవారీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా బ్యాంకు వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. అలాగే బ్యాంకు నిబంధనలు కూడా ఇందులో కీలకంగా ఉంటాయి. అందుకే ఒకే మొత్తంలో రుణం తీసుకున్నప్పటికీ ఇద్దరు వ్యక్తులకు వేర్వేరు వడ్డీ రేట్లు, ఈఎంఐలు ఉండవచ్చు. కాబట్టి రుణం తీసుకునే ముందు మీకు బ్యాంకు ఎంత వడ్డీ రేటును ఆఫర్ చేస్తుందో తెలుసుకోవాలి.
రూ.1 లక్ష లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ ఎంత?
మీరు ఎస్బీఐలో రూ.1 లక్ష పర్సనల్ లోన్ తీసుకున్నారని అనుకుందాం. దీనిపై 10 శాతం వార్షిక వడ్డీ ఉంటే ఏడాది కాలానికి నెలకు సుమారు రూ.8,792 ఈఎంఐ చెల్లించాలి. రెండేళ్ల కాలపరిమితికి నెలకు రూ.4,614, మూడేళ్లకు రూ.3,227, నాలుగేళ్లకు రూ.2,536, ఐదేళ్లకు రూ.2,125 చెల్లించాల్సి ఉంటుంది. అదే 12 శాతం వడ్డీ రేటు ఉంటే ఏడాదికి నెలకు రూ.8,885, రెండేళ్లకు రూ.4,707, మూడేళ్లకు రూ.3,321, నాలుగేళ్లకు రూ.2,633, ఐదేళ్లకు రూ.2,224 ఈఎంఐ వస్తుంది. ఇక 15 శాతం వడ్డీ రేటు ఉంటే ఏడాదికి నెలకు రూ.9,026, రెండేళ్లకు రూ.4,849, మూడేళ్లకు రూ.3,467, నాలుగేళ్లకు రూ.2,783, ఐదేళ్లకు రూ.2,379 చెల్లించాలి. అంటే వడ్డీ రేటుతో పాటు రుణ కాలపరిమితిని బట్టి మీ నెలవారీ ఈఎంఐ మారుతుంది.
తక్కువ ఈఎంఐ కోసం ఎక్కువ కాలం ఎంచుకుంటే నష్టమేనా?
పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు చాలామంది నెలవారీ ఈఎంఐ తక్కువగా ఉండాలని ఎక్కువ కాలపరిమితిని ఎంచుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల చివరికి బ్యాంకుకు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు, మీరు 10 శాతం వడ్డీతో రూ.1 లక్ష రుణం తీసుకుని ఐదేళ్లలో తిరిగి చెల్లిస్తే నెలకు సుమారు రూ.2,125 ఈఎంఐ వస్తుంది. ఈ ఐదేళ్లలో మొత్తం వడ్డీ సుమారు రూ.27,482 అవుతుంది.
అదే రుణాన్ని మూడేళ్లలో చెల్లిస్తే నెలకు రూ.3,227 ఈఎంఐ కట్టాలి. అయితే మొత్తం వడ్డీ సుమారు రూ.16,162 మాత్రమే అవుతుంది. అంటే రెండేళ్లు ముందుగానే రుణం తీర్చడం వల్ల దాదాపు రూ.11,320 వడ్డీ ఆదా చేసుకోవచ్చు.
ఇక 12 శాతం వడ్డీతో ఐదేళ్లకు తీసుకుంటే మొత్తం వడ్డీ సుమారు రూ.33,467 అవుతుంది. 15 శాతం వడ్డీతో తీసుకుంటే ఇది రూ.42,740 వరకు చేరుతుంది. అందుకే కేవలం నెలవారీ ఈఎంఐ తక్కువగా ఉందని ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోకూడదు. మొత్తం ఎంత వడ్డీ చెల్లించాల్సి వస్తుందో కూడా లెక్కించాలి.
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసే ముందు మీ నెలవారీ ఆదాయం, ఇంటి ఖర్చులు, ఇతర రుణాల ఈఎంఐలను పరిశీలించాలి. ప్రతి నెలా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా చెల్లించగలిగే ఈఎంఐనే ఎంచుకోవాలి. అలాగే బ్యాంకు వసూలు చేసే ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీల గురించి ముందుగానే తెలుసుకోవాలి. రుణాన్ని గడువు కంటే ముందే చెల్లించాలనుకుంటే ప్రీ-పేమెంట్ ఛార్జీలు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలించాలి. రుణ ఒప్పందంపై సంతకం చేసే ముందు అన్ని నిబంధనలను చదవాలి. ఈ విషయాలన్నీ తెలుసుకుని రుణం తీసుకుంటే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడవచ్చు.




