InnoData Layoffs: ఉద్యోగులకు ఐటీ కంపెనీ ఊహించని షాక్ ..ఉదయం లాగిన్.. మధ్యాహ్నానికి లేఆఫ్స్!

InnoData Layoffs: ప్రముఖ AI & డేటా ఇంజినీరింగ్ సంస్థ 'ఇన్నోడేటా' భారత్‌లో 550 మంది ఉద్యోగులను సడెన్‌గా తొలగించింది.

Gagan kumar
Published on: 28 Oct 2026 11:28 AM IST
InnoData Layoffs
X

InnoData Layoffs: ఉద్యోగులకు ఐటీ కంపెనీ ఊహించని షాక్ ..ఉదయం లాగిన్.. మధ్యాహ్నానికి లేఆఫ్స్!

Tech layoffs: ఐటీ రంగాన్ని మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ ప్రముఖ గ్లోబల్ డేటా ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల సంస్థ ‘ఇన్నోడేటా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ భారీ లేఆఫ్స్‌కు తెరతీసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, ఒక్కపూటలోనే ఏకంగా 550 మంది భారతీయ ఉద్యోగులను ఊడదీసి వీధికి ఈడ్చడం ఐటీ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

సోమవారం ఉదయం ఉద్యోగులు ఎప్పటిలాగే ఎంతో ఉత్సాహంగా ఆఫీస్ సిస్టమ్స్‌లో లాగిన్ అయ్యి తమ దైనందిన పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే లంచ్ సమయానికి పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. మొదట ఫిలిప్పీన్స్ బ్రాంచ్‌లోని ప్రాసెస్ అనలిస్టులు, టీమ్ లీడర్లను జూమ్ గ్రూప్ కాల్ ద్వారా ఒకేసారి తొలగించినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

ఈ వార్తల తీవ్రతను భారత్‌లోని ఉద్యోగులు అర్థం చేసుకునే లోపే.. వారి ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ ఐడీలు, హెచ్ఆర్ పేరోల్ అకౌంట్లు ఒకదాని తర్వాత ఒకటి సడెన్‌గా లాగౌట్ అయిపోయాయి. ఏం జరుగుతుందో తెలియక అభద్రతా భావానికి గురైన బాధితులు వెంటనే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోగా.. కొన్ని గంటల్లోనే అందులో ఏకంగా 500 మందికి పైగా చేరడం ఈ లేఆఫ్స్ తీవ్రతకు అద్దం పడుతోంది.

సొంత ఉద్యోగులతో కంపెనీ ప్రతినిధులు నేరుగా మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. సిస్టమ్స్ లాక్ చేసిన తర్వాత బాధితుల వ్యక్తిగత ఈ-మెయిల్ ఐడీలకు లేఆఫ్స్ లెటర్లు పంపించారు. ఉద్యోగుల పనితీరు లేదా సామర్థ్యం వల్ల ఈ తొలగింపులు జరగలేదని, అంతర్జాతీయ క్లయింట్ ప్రాజెక్ట్ అసైన్‌మెంట్ ముగియడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని మెయిల్‌లో పేర్కొన్నారు.

సిస్టమ్స్, పేరోల్ యాప్స్ ఉన్నపళంగా లాక్ కావడం వల్ల కనీసం తమ పాత పేస్లిప్పులు, ఎక్స్‌పీరియన్స్ లెటర్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. కంపెనీ ల్యాప్‌టాప్‌లు, ఆఫీస్ ప్రాపర్టీ తిరిగి అప్పగించిన తర్వాతే సెటిల్మెంట్ అమౌంట్ డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఇస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది. AI శకం వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ఏ క్షణాన ఏ ప్రాజెక్టు ముగుస్తుందో.. ఏ ప్రాసెస్ ఆగిపోతుందో తెలియక ఐటీ ఉద్యోగులు తీవ్ర అభద్రతా భావంతో గడుపుతున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.