SIP vs RD: నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెట్టే వారికి.. ఎస్ఐపీ లేదా ఆర్డీ రెండింటిలో ఏది మంచిది.?
SIP vs RD: డబ్బు సంపాదనతో పాటు దానిని సరైన విధానంలో పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి.
SIP vs RD: నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెట్టే వారికి.. ఎస్ఐపీ లేదా ఆర్డీ రెండింటిలో ఏది మంచిది.?
SIP vs RD: డబ్బు సంపాదనతో పాటు దానిని సరైన విధానంలో పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. ఇందుకోసం ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిలో ఎస్ఐపీ, ఆర్డీలు చాలా మందికి తెలిసి ఉంటుంది. మరి నెలకు రూ. 10 వేలు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఈ రెండింటిలో ఏది మంచి ఆప్షన్ ఇప్పడు తెలుసుకుందాం.
RD అంటే ఏమిటి?
RD అంటే రికరింగ్ డిపాజిట్. ఇది బ్యాంకులు, పోస్టాఫీసులు అందించే ఒక సురక్షిత సేవింగ్స్ పథకం. ఇందులో ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని జమ చేస్తూ వెళ్లాలి. దీనిపై బ్యాంక్ ముందుగానే నిర్ణయించిన వడ్డీ రేటు ప్రకారం రాబడి లభిస్తుంది. మార్కెట్ మార్పులతో దీనికి ఎలాంటి సంబంధం ఉండదు కాబట్టి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడిపై భద్రత కోరుకునే వారు, ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు లేదా రిస్క్ తీసుకోవాలనుకోని వారు సాధారణంగా RDను ఎంచుకుంటారు. చిన్నకాల లక్ష్యాల కోసం కూడా ఇది మంచి ఆప్షన్‌గా భావిస్తారు.
SIP ఎలా పనిచేస్తుంది?
SIP అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇది మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తాన్ని పెట్టుబడి పెట్టే విధానం. ఈ డబ్బు ఈక్విటీ, డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ అవుతుంది. మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రాబడి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు లాభాలు ఎక్కువగా రావచ్చు, మరికొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా నష్టాలు కనిపించవచ్చు. అయితే దీర్ఘకాలంలో చూస్తే SIP ద్వారా సంపద వేగంగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే యువత ఎక్కువగా SIPల వైపు మొగ్గు చూపుతున్నారు.
నెలకు రూ.10,000 RD చేస్తే ఎంత మొత్తం వస్తుంది?
సుమారు 6.05 శాతం వడ్డీ రేటు ఆధారంగా లెక్కిస్తే, ప్రతి నెలా రూ.10,000 RDలో జమ చేస్తే 10 సంవత్సరాల తర్వాత సుమారు రూ.16.48 లక్షలు అందే అవకాశం ఉంటుంది. అదే విధంగా 15 సంవత్సరాల వరకు కొనసాగిస్తే మొదటి 10 ఏళ్ల మెచ్యూరిటీ మొత్తాన్ని FDలో పెట్టి, మరో 5 ఏళ్ల RD కొనసాగించినట్లయితే మొత్తం సుమారు రూ.29.27 లక్షలు చేరవచ్చు. ఇక 20 సంవత్సరాల వరకు ప్లాన్ చేస్తే మొదటి 10 ఏళ్ల RD మొత్తాన్ని మరో 10 సంవత్సరాలు FDలో ఉంచి, అదనంగా RD కొనసాగిస్తే మొత్తం సుమారు రూ.46.54 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. RDలో రాబడి స్థిరంగా ఉండటం ఒక ప్రయోజనం అయినప్పటికీ, సంపద పెరుగుదల మాత్రం పరిమితంగానే ఉంటుంది.
SIPలో రూ.10,000 పెట్టుబడి పెడితే ఎంత సంపద తయారవుతుంది?
SIPలో రాబడి పూర్తిగా మీరు ఎంచుకునే ఫండ్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా డెట్ ఫండ్స్ 6 నుంచి 7 శాతం వరకు, హైబ్రిడ్ ఫండ్స్ 8 నుంచి 10 శాతం వరకు, ఈక్విటీ ఫండ్స్ 10 నుంచి 13 శాతం వరకు రాబడి ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రతి నెలా రూ.10,000 SIPలో పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల తర్వాత 12 శాతం రాబడితో సుమారు రూ.22.40 లక్షలు రావచ్చు. అదే 13 శాతం రాబడితో చూస్తే దాదాపు రూ.23.63 లక్షలు చేరవచ్చు.
15 సంవత్సరాల పాటు కొనసాగిస్తే 12 శాతం రాబడిపై సుమారు రూ.47.59 లక్షలు, 13 శాతం రాబడిపై దాదాపు రూ.51.85 లక్షలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 20 సంవత్సరాల పాటు SIP కొనసాగిస్తే 12 శాతం రాబడితో రూ.91.98 లక్షలు, 13 శాతం రాబడితో రూ.1.03 కోట్లు వరకు సంపద సృష్టించే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. దీర్ఘకాలంలో కంపౌండింగ్ ప్రభావం కారణంగా SIPలో సంపద వేగంగా పెరుగుతుంది.
రెండింటిలో ఏది మంచిది.?
పెట్టుబడిదారుడి లక్ష్యాలపై ఆధారపడి సరైన ఎంపిక మారుతుంది. మీకు పెట్టుబడిపై భద్రత ముఖ్యమైతే, రిస్క్ అసలు వద్దనుకుంటే, ఫిక్స్‌డ్ రిటర్న్ కావాలనుకుంటే RD మంచి ఎంపిక అవుతుంది. ముఖ్యంగా చిన్నకాల లక్ష్యాల కోసం ఇది సరైన మార్గంగా చెప్పొచ్చు.
అయితే దీర్ఘకాలంలో ఎక్కువ సంపద సృష్టించాలనుకునేవారికి SIP మెరుగైన ఆప్షన్‌గా కనిపిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను భరించే సహనం ఉంటే SIP ద్వారా RD కంటే ఎక్కువ రాబడి పొందే అవకాశాలు ఉంటాయి. అందుకే ఫైనాన్షియల్ నిపుణులు కూడా దీర్ఘకాల పెట్టుబడుల కోసం SIPను ప్రాధాన్యతగా సూచిస్తున్నారు.




