FD: టెన్షన్ తక్కువ లాభాలు ఎక్కువ.. ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే లాభాల వర్షం ఖాయం
FD: ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది సురక్షిత మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వాటిలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఏంటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
FD
FD: ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో చాలా మంది సురక్షిత మార్గాల వైపు అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వాటిలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఒకటి. ఇంతకీ ఏంటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీ.? దీంతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ అంటే ఏమిటి?
స్టాక్ మార్కెట్, క్రిప్టో వంటి రిస్క్ ఉన్న పెట్టుబడులను దూరంగా ఉంచాలనుకునే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ (FD) ఒక భద్రమైన మార్గం. ఇందులో మీరు ఒకసారి డబ్బు పెట్టిన తర్వాత నిర్ణయించిన కాలానికి స్థిరమైన వడ్డీ వస్తుంది. Small Finance Banks కూడా ఇదే విధంగా FDలను అందిస్తాయి. అయితే వీటి ప్రత్యేకత ఏమిటంటే, ఇవి సాధారణ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తాయి. గ్రామీణ ప్రాంతాలు, చిన్న వ్యాపారులు వంటి వర్గాలకు బ్యాంకింగ్ సేవలు అందించడమే వీటి ప్రధాన లక్ష్యం.
టాప్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు
ప్రస్తుతం దేశంలో కొన్ని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎఫ్‌డీలపై మంచి వడ్డీ అందిస్తున్నాయి. జన స్మాల్ ఫైనాన్స్ బుక్ 1 నుంచి 3 సంవత్సరాల కాలానికి సుమారు 7.50% వడ్డీ ఇస్తోంది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 30 నుంచి 36 నెలల కాలానికి 7.10% వడ్డీ అందిస్తోంది. ఉత్క్రష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా 2 నుంచి 3 సంవత్సరాల FDలకు 7.50% వడ్డీ ఇస్తోంది. సుర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే 30 నెలల FDపై 8.10% వరకు వడ్డీ ఇస్తూ ముందుంది. ఉజ్వన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 24 నెలల FDలకు 7.55% వడ్డీ ఇస్తోంది. సీనియర్ సిటిజన్లకు సాధారణంగా ఈ రేట్లపై అదనంగా 0.50% వరకు లాభం ఉంటుంది.
డిపాజిట్ భద్రత ఎలా ఉంటుంది?
చాలామందికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సేఫ్‌నా అనే సందేహం ఉంటుంది. కానీ ఈ బ్యాంకుల్లో పెట్టుబడి కూడా భద్రంగానే ఉంటుంది. Dడిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) ద్వారా రూ. 5 లక్షల వరకు డిపాజిట్లు బీమా కింద రక్షణ పొందుతాయి. ఈ సంస్థ ఆర్బీఐ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే బ్యాంక్ ఏదైనా సమస్యలో పడినా రూ. 5 లక్షల వరకు మీ డబ్బు సురక్షితంగా ఉంటుంది.
ఎక్కువ వడ్డీ ఎందుకు ఇస్తాయి?
స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎక్కువ వడ్డీ ఇవ్వడానికి ముఖ్య కారణం మార్కెట్లో తమ స్థానం పెంచుకోవడం. పెద్ద బ్యాంకులతో పోటీ పడటానికి ఇవి కస్టమర్లను ఆకర్షించేలా అధిక వడ్డీ రేట్లు ప్రకటిస్తాయి. సాధారణంగా ఇతర బ్యాంకులతో పోలిస్తే 1% నుంచి 2% వరకు ఎక్కువ వడ్డీ ఇస్తాయి. దీని వల్ల చిన్న మొత్తంగా కనిపించే తేడా కూడా దీర్ఘకాలంలో కాంపౌండింగ్ కారణంగా పెద్ద లాభంగా మారుతుంది. అందుకే చాలా మంది ఇప్పుడు ఈ బ్యాంకుల FDలను ఎంపిక చేస్తున్నారు.
పెట్టుబడి పెట్టే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు
FDలో పెట్టుబడి పెట్టే ముందు కొన్ని ముఖ్య విషయాలు గుర్తుంచుకోవాలి. వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారుతుంటాయి కాబట్టి ముందుగా వివిధ బ్యాంకుల రేట్లను పోల్చుకోవడం మంచిది. టెన్యూర్ ఆధారంగా వడ్డీ మారుతుంది కాబట్టి మీ అవసరానికి సరిపోయే కాలాన్ని ఎంచుకోవాలి. FDపై వచ్చే వడ్డీ ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ట్యాక్స్‌కు లోబడి ఉంటుంది. అయితే Tax-saving FDలను ఎంచుకుంటే సెక్షన్ 80C కింద రూ. 1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. మొత్తానికి, రిస్క్ తక్కువగా ఉండి స్థిరమైన ఆదాయం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా చెప్పవచ్చు.




