Rs 2,000 Note: మీ దగ్గర ఇంకా రూ2 వేల నోటు ఉందా.. అయితే ఇది మీ కోసమే!
Rs 2,000 Note: మార్కెట్లో రూ. 2,000 నోట్ల గడువు ముగిసినా, అవి ఇప్పటికీ చట్టబద్ధమైనవేనని ఆర్బీఐ స్పష్టం చేసింది.
Rs 2,000 Note: మీ దగ్గర ఇంకా రూ2 వేల నోటు ఉందా.. అయితే ఇది మీ కోసమే!
RBI: రెండు వేల నోటు... ఒకప్పుడు పర్సులో ఉంటే ఆ గంభీరమే వేరు. అయితే, 2023 మే నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో కథ మారిపోయింది. గడువు ముగిసిపోయింది, ఇక ఈ నోటు చెల్లదేమో అని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ, మీ దగ్గర ఇంకా రూ. 2,000 నోట్లు మిగిలి ఉంటే అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు! ఎందుకంటే కేంద్ర బ్యాంకు తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. రూ. 2 వేల నోటు ఇప్పటికీ పూర్తిగా చట్టబద్ధమైనదే అని స్పష్టం చేస్తూ, ప్రజలకు భారీ ఉపశమనాన్ని ఇచ్చింది.
ఆర్బీఐ 2023 మే 19న ఉపసంహరణ ప్రకటన చేసినప్పుడు, మార్కెట్లో ఏకంగా రూ. 3.56 లక్షల కోట్ల విలువైన రెండు వేల నోట్లు చలామణిలో ఉండేవి. కానీ, ప్రజల నుంచి వచ్చిన స్పందనతో ఏప్రిల్ 2026 నాటికి ఏకంగా 98.47 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చేశాయి. ఇప్పుడు మార్కెట్లో కేవలం రూ. 5,451 కోట్ల విలువైన నోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మిగిలిన కొద్దిపాటి నోట్లను కూడా వెనక్కి రాబట్టేందుకు ఆర్బీఐ ప్రయత్నిస్తోంది.
సాధారణ బ్యాంకు శాఖల్లో ఈ నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ 2023 అక్టోబర్ 7 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. ప్రస్తుతం ఆ గడువు ముగిసింది. అయినప్పటికీ, ప్రజలు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆర్బీఐ రెండు సులువైన మార్గాలను అందుబాటులో ఉంచింది. మీరు నేరుగా దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ జారీ కార్యాలయాలను సందర్శించి మీ నోట్లను మార్చుకోవచ్చు లేదా మీ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు.
ఆర్బీఐ ఆఫీసులకు వెళ్లలేని వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీరు దేశంలోని ఏ పోస్ట్ ఆఫీస్ నుంచైనా మీ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను నేరుగా ఆర్బీఐ జారీ కార్యాలయానికి ఇన్సూర్డ్ పోస్ట్ ద్వారా పంపవచ్చు. ఆ నోట్లు ఆర్బీఐకి చేరిన తర్వాత, ఆ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోతాయనే పుకార్లను నమ్మకండి.
అవి ఇప్పటికీ చట్టబద్ధమైనవే. కాకపోతే వాటిని మార్కెట్లో నేరుగా ఖర్చు చేయడం కంటే, పైన పేర్కొన్న పద్ధతుల్లో ఆర్బీఐ ద్వారా మీ ఖాతాల్లోకి మార్చుకోవడం సురక్షితం. కాబట్టి, మీ బీరువాలోనో, పాత పర్సుల్లోనో ఇంకా రెండు వేల నోట్లు దాగి ఉంటే... ఆలస్యం చేయకుండా వెంటనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.




