Stock Market Holiday : అంబేద్కర్ జయంతి సందర్భంగా మార్కెట్లకు నేడు హాలిడే.. మళ్ళీ ట్రేడింగ్ ఎప్పుడు?

Stock Market Holiday : అంబేద్కర్ జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రెండూ ఈరోజు పనిచేయవు.

CR Reddy
Published on: 14 April 2026 9:02 AM IST
Stock Market Holiday
X

Stock Market Holiday

Stock Market Holiday : అంబేద్కర్ జయంతి సందర్భంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రెండూ ఈరోజు పనిచేయవు. కేవలం ఈక్విటీలే కాకుండా, డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) వంటి అన్ని విభాగాలు మూతబడ్డాయి. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) మాత్రం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయదు కానీ, సాయంత్రం 5 గంటల తర్వాత నైట్ సెషన్ కోసం ఓపెన్ అవుతుంది. మళ్ళీ రేపు (ఏప్రిల్ 15) ఉదయం ఎప్పటిలాగే ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.

ఏప్రిల్ నెలలో ఇదే చివరి సెలవు

ఈ ఏప్రిల్ నెలలో స్టాక్ మార్కెట్లకు ఇదే చివరి ట్రేడింగ్ సెలవు. వచ్చే నెల మే 1న మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్లు మళ్ళీ మూతపడనున్నాయి. 2026 ఏడాది మొత్తంగా చూసుకుంటే ఇంకా సుమారు 10 వరకు సెలవులు మిగిలి ఉన్నాయి. వచ్చే నెలలో మరో రెండు సెలవులు రానున్నాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి ప్రణాళికలను ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని రూపొందించుకోవడం మంచిది.

నిన్నటి మార్కెట్ పరిస్థితి ఏంటి?

నిన్న (సోమవారం) స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న ఉద్రిక్తతలు, పెరుగుతున్న ముడి చమురు ధరలు మార్కెట్లను కుంగదీశాయి. నిన్న నిఫ్టీ 50 దాదాపు 1 శాతం తగ్గి 23,842 వద్ద ముగియగా, సెన్సెక్స్ 76,788 వద్ద స్థిరపడింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రాబోయే రోజుల్లో కూడా మార్కెట్ అస్థిరంగా ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story