Stock : రెండేళ్లలోనే 400% పైగా లాభాలు.. 1 లక్ష పెడితే.. రూ. 5.50 లక్షలు వచ్చాయ్

Stock : కేవలం రెండేళ్లలోనే 450% పైగా బంపర్ రిటర్న్స్ ఇచ్చిన స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ సుదర్శన్ ఫార్మా.

Naresh.k
Published on: 18 Jun 2026 7:58 AM IST
Stock
X

Stock : రెండేళ్లలోనే 400% పైగా లాభాలు.. 1 లక్ష పెడితే.. రూ. 5.50 లక్షలు వచ్చాయ్

Sudarshan Pharma : షేర్ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల భాగ్యాన్ని మార్చేసే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం అందరూ ఆరాటపడుతుంటారు. అలాంటి వారి కన్ను ఇప్పుడు ఒక చిన్న ఫార్మా కంపెనీ షేరుపై పడింది. కేవలం రెండేళ్లలోనే ఏకంగా 400 శాతం పైగా లాభాలను అందిస్తూ దూసుకుపోతున్న ఆ స్మాల్ క్యాప్ స్టాక్ వివరాలు, నేడు జరగబోయే కీలక పరిణామాలు ఓసారి చూద్దాం.

భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఫార్మా రంగానికి చెందిన సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇన్వెస్టర్ల మధ్య చర్చనీయాంశమైంది. ఇటీవల ట్రేడింగ్‌లో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ సరికొత్త 52-వారాల రికార్డును సృష్టించి రూ. 38 స్థాయికి చేరుకుంది. మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ప్రస్తుతం రూ. 37 దిగువన ట్రేడవుతున్నప్పటికీ, గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.

సుదర్శన్ ఫార్మా కేవలం లాంగ్ టర్మ్‌లోనే కాకుండా షార్ట్ టర్మ్‌లోనూ ఇన్వెస్టర్లకు బంపర్ ప్రాఫిట్స్ అందించింది. ఈ స్టాక్ వృద్ధి ప్రస్థానం ఇలా ఉంది. 1 నెలలో 20% వృద్ధి,3 నెలల్లో: 55% లాభం, 6 నెలల్లో 45% మేర లాభాలు, 2 ఏళ్లలో ఏకంగా 455% బంపర్ రిటర్న్స్. అంటే ఇందులో రెండేళ్ల క్రితం పెట్టిన రూ. 1 లక్ష పెట్టుబడి.. ఇప్పుడు రూ. 5.50 లక్షలుగా మారింది. 3 ఏళ్లలో 438% వృద్ధి, 5 ఏళ్ల కాలంలో సుమారు 500% మేర అద్భుత వృద్ధి.

కంపెనీ జూన్‌లో ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఒక కీలక ప్రకటన చేసింది. జూన్ 18, 2026 న కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో కంపెనీకి అవసరమైన అదనపు నిధుల సమీకరణ ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ ప్లాన్ ప్రకారం ఈక్విటీ షేర్లు, వారెంట్లు, కన్వర్టిబుల్ సెక్యూరిటీలు లేదా డెట్ సెక్యూరిటీల ద్వారా నిధులను సేకరించే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా ఎంత మొత్తం సేకరిస్తుంది, దాని ఖచ్చితమైన ఉద్దేశం ఏంటనేది వెల్లడించనప్పటికీ, మార్కెట్ నిపుణులు దీనిని ఈ స్టాక్‌కు ఒక పెద్ద ట్రిగర్‌గా భావిస్తున్నారు.

ఫండ్ రైజింగ్ ప్లాన్‌కు ముందే జూన్ 12న కంపెనీ వారెంట్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమోటర్ కేటగిరీ ఇన్వెస్టర్లకు 9 లక్షల వారెంట్ల కన్వర్షన్ తర్వాత, ఒక్కో షేరుకు రూ. 16.983 ధర చొప్పున 90 లక్షల ఈక్విటీ షేర్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా కంపెనీకి రూ. 11.46 కోట్ల అదనపు మూలధనం లభించింది.

మార్కెట్ విశ్లేషణ: సాధారణంగా కంపెనీలో ప్రమోటర్ల వాటా పెరగడాన్ని మార్కెట్ ఎప్పుడూ ఒక పాజిటివ్ సైన్‌గా చూస్తుంది. కంపెనీ భవిష్యత్తుపై ప్రమోటర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. ఈరోజు జరగబోయే మీటింగ్ తర్వాత నిధులను కంపెనీ అప్పులు తగ్గించుకోవడానికి వాడనుందా లేదా బిజినెస్ విస్తరణకు ఉపయోగించనుందా అనే క్లారిటీ వస్తే, ఈ షేరులో తదుపరి బుల్ రన్ ప్రారంభం కావచ్చు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story