Supreme Court: యూపీఐ లావాదేవీల ఎండీఆర్‌ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ విధింపు వ్యవహారంలో కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

Arun Chilukuri
Published on: 28 Sept 2026 3:47 PM IST
Supreme Court
X

Supreme Court: యూపీఐ లావాదేవీల ఎండీఆర్‌ ఛార్జీలపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court: యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించే అంశంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో ఎండీఆర్‌ అమలుపై స్టే విధించేందుకు మాత్రం ధర్మాసనం నిరాకరించింది. రూ.2 వేలు దాటిన యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం ఎండీఆర్‌ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15 నుంచి ఇది అమల్లోకి రానున్న నేపథ్యంలో.. దీనిని సవాల్ చేస్తూ న్యాయవాది అంజన్‌దత్తా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో నాలుగు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) లకు నోటీసులు జారీ చేసింది. అయితే అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రాబోయే ఎండీఆర్‌ ఛార్జీలపై ఎలాంటి మధ్యంతర స్టే ఇవ్వలేమని పిటిషనర్‌కు స్పష్టం చేసింది.

విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎన్.వెంకటరామన్ వాదనలు వినిపించారు. ఈ ఎండీఆర్‌ ఛార్జీల వల్ల దేశంలోని 96 శాతం మంది సాధారణ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని, ఎలాంటి ప్రభావం ఉండదని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.