Tata Trusts: చంద్రశేఖరన్‌కు టాటా ట్రస్టుల షాక్.. కోర్టుకు వెళ్లాలని కీలక నిర్ణయం!
Tata Trusts: టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామక తీర్మానాన్ని సవాలు చేస్తూ టాటా ట్రస్ట్‌లు బాంబే హైకోర్టును ఆశ్రయించనున్నాయి.
Tata Trusts: చంద్రశేఖరన్‌కు టాటా ట్రస్టుల షాక్.. కోర్టుకు వెళ్లాలని కీలక నిర్ణయం!
Tata Trusts: టాటా గ్రూప్ అధినాయకత్వ వ్యవహారంలో నెలకొన్న వివాదం ఇప్పుడు న్యాయస్థానం మెట్లెక్కింది. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్. చంద్రశేఖరన్ పునర్నియామకాన్ని సవాలు చేస్తూ నోయెల్ టాటా నేతృత్వంలోని టాటా ట్రస్ట్‌లు బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, ఆర్‌డీ టాటా ట్రస్ట్‌లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. సెప్టెంబర్ 17న జరిగిన బోర్డు సమావేశంలో 2027 ఫిబ్రవరి నుంచి మరో ఐదేళ్ల కాలానికి చంద్రశేఖరన్ పునర్నియామకానికి ఆమోదం లభించినప్పటికీ, కంపెనీ నిబంధనల ప్రకారం సరైన ఓట్లు పడలేదని ట్రస్ట్‌లు వాదిస్తున్నాయి.
వివాదానికి ప్రధాన కారణాలు ఇవే:
టాటా సన్స్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ (AoA - ఆర్టికల్ 121) ప్రకారం, చైర్మన్ నియామకం లేదా పునర్నియామకం వంటి కీలక నిర్ణయాలకు సమావేశంలో ఉన్న ట్రస్ట్ నామినేటెడ్ డైరెక్టర్ల మెజారిటీ మద్దతు తప్పనిసరి. అయితే సెప్టెంబర్ 17 సమావేశంలో ఆ నిబంధన పాటించలేదని ట్రస్ట్‌లు పేర్కొంటున్నాయి. ఆ తీర్మానాన్ని చెల్లనిదిగా ప్రకటించాలని హైకోర్టును కోరనున్నాయి.
చంద్రశేఖరన్ పునర్నియామక ఓటింగ్ సందర్భంగా ట్రస్ట్ నామినేటెడ్ డైరెక్టర్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నోయెల్ టాటా వ్యతిరేకంగా ఓటు వేయగా, వేణు శ్రీనివాసన్ అనుకూలంగా ఓటు వేశారు. దీంతో సమావేశానికి అధ్యక్షత వహించిన హరీశ్ మన్వానీ తన 'కాస్టింగ్ ఓటు' (Casting Vote) వినియోగించి తీర్మానానికి ఆమోదం దక్కేలా చేశారు. అయితే, నిబంధనల ప్రకారం అవసరమైన సానుకూల ఓట్ల స్థానంలో కాస్టింగ్ ఓటు చెల్లదని ట్రస్ట్‌లు వాదిస్తున్నాయి. సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ రూ.50 కోట్లు, ఆర్‌డీ టాటా ట్రస్ట్ రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.65 కోట్ల నష్టపరిహారం కోరుతున్నట్లు సమాచారం.
కోర్టుకు వెళ్లే నిర్ణయంపై ట్రస్ట్‌లలో అంతర్గతంగా ఓటింగ్ నిర్వహించగా.. నోయెల్ టాటా, నెవిల్ టాటా, భాస్కర్ భట్ న్యాయపోరాటానికి మద్దతు తెలిపారు. కాగా, వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ దీనిని వ్యతిరేకించారు.
టాటా సన్స్ బోర్డు సమావేశం ఈ నెల 30న జరగనున్న నేపథ్యంలో, భవిష్యత్తులోనూ ఇలాంటి వివాదాలు తలెత్తకుండా, డైరెక్టర్ల మధ్య చీలిక వచ్చినప్పుడు చైర్మన్ కాస్టింగ్ ఓటు వేయకుండా నిలువరించేలా తక్షణ మధ్యంతర ఆదేశాలు ఇవ్వాలని ట్రస్ట్‌లు కోరుతున్నాయి.
టాటా సన్స్‌లో టాటా ట్రస్ట్‌లకు సుమారు 66 శాతం వాటా ఉంది. కార్పొరేట్ గవర్నెన్స్, కీలక నిర్ణయాల్లో ట్రస్ట్ నామినేటెడ్ డైరెక్టర్ల అధికారానికి సంబంధించిన ఈ పోరు వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.




