Tata Gold ETF lumpsum: గోల్డ్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..పెట్టుబడులపై పరిమితులు లేవ్..!
Tata Gold ETF lumpsum: టాటా మ్యూచువల్ ఫండ్ తమ గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్ ఎఫ్ఓఎఫ్ పథకాలలో ఏకమొత్తం పెట్టుబడులపై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది.
Tata Gold ETF lumpsum: గోల్డ్ ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..పెట్టుబడులపై పరిమితులు లేవ్..!
Tata Gold ETF lumpsum: పసిడిలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లకు టాటా మ్యూచువల్ ఫండ్ గొప్ప ఊరటనిచ్చింది. తమ పాపులర్ పథకాలైన టాటా గోల్డ్ ఈటీఎఫ్ , టాటా గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్ స్కీమ్‌లలో పెద్ద ఇన్వెస్టర్ల ఏకమొత్తం పెట్టుబడులపై విధించిన పరిమితులను ఎత్తివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ నిర్ణయంతో ఇన్వెస్టర్లు ఎలాంటి గరిష్ఠ పరిమితి లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో పసిడి పథకాలపై ఇన్వెస్ట్ చేసుకునే వెసులుబాటు మళ్లీ లభించింది. గతంలో అంతర్జాతీయ పసిడి మార్కెట్లోని అస్థిరతలు, సరఫరా సమస్యల కారణంగా పెద్ద మొత్తాల ఏకమొత్తం పెట్టుబడులపై కొన్ని ఆంక్షలు విధించారు.
ముఖ్యంగా జూన్ 8, 2026 నుంచి రూ. 25 కోట్ల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేసే భారీ ఇన్వెస్టర్ల సబ్‌స్క్రిప్షన్లపై తాత్కాలికంగా ఆంక్షలు అమలయ్యాయి. అయితే, ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఆగస్టు 21, 2026 నుంచే ఈ కొత్త నిబంధనలను సవరించి ఆంక్షలను పూర్తిగా తొలగించారు.
తదుపరి నోటీసు ఇచ్చేంత వరకు ఎలాంటి పరిమితులు లేకుండా డిజిటల్ బంగారంపై ఇన్వెస్ట్ చేయవచ్చు. రిటైల్, సంస్థాగత ఇన్వెస్టర్లు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కొనసాగిస్తూనే, మార్కెట్ కరెక్షన్లు లేదా బంగారం ధరలు తగ్గిన సమయంలో ఏకమొత్తంలో ఎంత మొత్తమైనా డిప్స్‌లో కొనుగోలు చేయవచ్చు.
డిజిటల్ లేదా ఈటీఎఫ్ రూపంలో గోల్డ్ కొనుగోలు చేయడం వల్ల ఫిజికల్ గోల్డ్‌కి ఉండే లాకర్ ఛార్జీలు, తయారీ కూలీ , లేదా స్వచ్ఛత గురించిన భయాలు అసలు ఉండవు. Tata Gold ETF అనేది దేశీయ బంగారం ధరలను నేరుగా అనుసరించే ఓపెన్-ఎండెడ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ కాగా, Tata Gold ETF FoF ఈ ఈటీఎఫ్‌లోనే తిరిగి ఇన్వెస్ట్ చేసే ఫండ్-ఆఫ్-ఫండ్స్ పథకం.
పసిడికి డిమాండ్ పెరుగుతున్న వేళ, టాటా మ్యూచువల్ ఫండ్ తీసుకున్న ఈ నిర్ణయం పోర్ట్‌ఫోలియోను వైవిధ్యపరచుకోవడానికి ఇన్వెస్టర్లకు అద్భుతమైన అవకాశంగా మారనుంది.




