Tata Group: ఆ ఒక్క మాటతో దూసుకెళ్లిన టాటా గ్రూప్ షేర్లు..!
Tata Group: టాటా సన్స్ ఛైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పదవీకాలం పొడిగింపు , టాటా సన్స్ ఐపీఓ వార్తలతో టాటా గ్రూప్ షేర్లు ఏకంగా 14% వరకు లాభపడ్డాయి.
Tata Group: ఆ ఒక్క మాటతో దూసుకెళ్లిన టాటా గ్రూప్ షేర్లు..!
Tata Group: భారతీయ స్టాక్ మార్కెట్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకత ఉండే దిగ్గజ బ్రాండ్ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా టాటా గ్రూపే. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ఈ కంపెనీల షేర్లు తాజాగా సరికొత్త ఉత్సాహంతో దూసుకెళ్లాయి. ఇన్వెస్టర్లలో జోష్ నింపుతూ టాటా గ్రూప్ షేర్లు ఏకంగా 14 శాతం వరకు లాభపడి మార్కెట్లో సంచలనం సృష్టించాయి. మరి ఈ భారీ లాభాలకు, మార్కెట్ పరుగులు పెట్టడానికి అసలు కారణమేంటి? ఏయే షేర్లు ఎంతలా పెరిగాయో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
టాటా గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పరుగులు పెట్టడానికి ప్రధానంగా రెండు బలమైన కారణాలు ఉన్నాయి. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా సమర్థుడైన ఎన్ చంద్రశేఖరన్‌కు మరో ఐదేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వెలువడడం ఇన్వెస్టర్లలో నూతనోత్సాహాన్ని నింపింది. ఆయన సారథ్యంలో గ్రూప్ సాధిస్తున్న ప్రగతిపై మదుపర్లు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'టాటా సన్స్' ఐపీఓ దిశగా అడుగులు పడుతుండటంతో, నేరుగా టాటా సన్స్‌లో వాటాలు ఉన్న కంపెనీల షేర్లను దక్కించుకునేందుకు ఇన్వెస్టర్లు పోటీ పడ్డారు.
ఈ పరిణామాల నేపథ్యంలో టాటా గ్రూప్‌కు చెందిన పలు ప్రముఖ కంపెనీల షేర్లు అప్పర్ సర్క్యూట్‌లను తాకుతూ అదరగొట్టాయి. టాటా సన్స్‌లో ఏకంగా 2.53 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ షేరు అత్యధికంగా 14 శాతం భారీ ర్యాలీ నమోదు చేసింది. ఇంట్రాడేలో రూ.832 గరిష్ఠ స్థాయిని తాకి, చివరకు 6 శాతం లాభంతో రూ.775 వద్ద స్థిరపడింది. ఈ కంపెనీ షేర్లు సైతం అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఇంట్రాడేలో 12 శాతానికి పైగా పెరిగి రూ.733.50ని తాకి, చివరకు 5.43 శాతం లాభంతో రూ.719 వద్ద ముగిశాయి.
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజమైన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ షేర్లు ఒక దశలో 10 శాతం వరకు ఎగబాకి, చివరికి 4.5 శాతం లాభంతో రూ.314 వద్ద స్థిరపడ్డాయి. ఉక్కు రంగ దిగ్గజమైన టాటా స్టీల్ షేర్లు ఇంట్రాడేలో 5 శాతం పెరిగి రూ.189.49 గరిష్ఠాన్ని తాకగా, చివరకు 4.29 శాతం లాభంతో రూ.187.29 వద్ద ముగిశాయి. ఎన్ చంద్రశేఖరన్ సీఈఓగా సేవలందించి విజయపథంలో నడిపించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఐటీ షేర్లు ఈరోజు 3 శాతానికి పైగా లాభపడ్డాయి. టాటా టెక్నాలజీస్ షేర్లు ఇంట్రాడేలో రూ.767.80 తాకి, చివరకు 1.15 శాతం లాభంతో రూ.757 వద్ద ముగియగా.. టాటా ఎల్క్సి షేర్లు సైతం 0.15 శాతం లాభంతో రూ.3378 వద్ద స్థిరపడ్డాయి.
టాటా గ్రూప్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు దేశీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను ఒక్కసారిగా పాజిటివ్‌గా మార్చేశాయి. రాబోయే రోజుల్లో టాటా సన్స్ పబ్లిక్ ఇష్యూ మరింత స్పష్టత వస్తే మార్కెట్లో ఈ జోరు మరింత కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.




