టీసీఎస్ ఎదుట కో-లివింగ్ పేరిట అసాంఘిక కార్యకలాపాలు..ఓయో రూమ్‌లను మించిపోయేలా..
Co-Living: హైదరాబాద్‌లోని ఆదిబట్లలో కో-లివింగ్ పేరుతో వెలుస్తున్న కొన్ని హాస్టళ్ల నిర్వహణపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టీసీఎస్ ఎదుట కో-లివింగ్ పేరిట అసాంఘిక కార్యకలాపాలు..ఓయో రూమ్‌లను మించిపోయేలా..
Co-Living: ఒకప్పుడు ప్రశాంతమైన గ్రామీణ వాతావరణానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ఆదిబట్ల ప్రాంతం.. ఇప్పుడు ఐటీ కంపెనీలు, పరిశ్రమల రాకతో శరవేగంగా మహానగరంగా మారుతోంది. దేశం నూలుమూలల నుంచి వేలాది మంది యువతీయువకులు ఉపాధి వెతుక్కుంటూ ఇక్కడకు వస్తుండటంతో వసతి సదుపాయాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
ఇదే అదనుగా భావించి రియల్ాఎస్టేట్, హాస్టల్ వ్యాపారం విపరీతంగా విస్తరిస్తోంది. అయితే, ఇదే సమయంలో ఆదిబట్లలో పుట్టుకొస్తున్న కొన్ని కో-లివింగ్ హాస్టళ్ల నిర్వహణ తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా, ఆందోళనకరంగా మారుతోంది.
ఆదిబట్ల సర్కిల్ కేంద్రంలోని ఔటర్ సర్వీస్ రోడ్డు నుంచి ఆదిబట్ల వెళ్లే మార్గంలో.. ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ ఎదురుగా ఉన్న శ్రీమిత్ర వెంచర్‌లో వందల కొద్దీ హాస్టళ్లు వెలిశాయి. అయితే వీటిలో కొన్ని హాస్టళ్ల యజమానులు సరికొత్త ట్రెండ్ పేరుతో అడుగులు వేస్తున్నారు. కో-లివింగ్ పేరిట అబ్బాయిలు, అమ్మాయిలు ఒకే గదిలో ఉండేలా బోర్డులు ఏర్పాటు చేసి ఉద్యోగులను ఆకర్షిస్తున్నారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.
సాధారణ హాస్టళ్లు, పీజీ సంస్కృతి వేరుగా ఉంటుందని, కానీ ఈ కో-లివింగ్ పేరిట కొన్ని వసతి గృహాలు అక్షరాలా ఓయో రూమ్‌లను తలపిస్తున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇక్కడి కొన్ని హాస్టళ్లపై ఫిర్యాదులు రాగా, తాజాగా మళ్లీ అదే తరహాలో ధోరణులు పుట్టుకోస్తున్నాయి.
అభివృద్ధిని, వసతి గృహాలు ఏర్పాటవడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు. కానీ కో-లివింగ్ పేరుతో విదేశీ సంస్కృతి మోజులో మన సంప్రదాయ విలువలు, కట్టుబాట్లు కనుమరుగవుతున్నాయి. వయోజనుల వ్యక్తిగత స్వేచ్ఛ ఎలా ఉన్నప్పటికీ.. ఈ వసతి కేంద్రాలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయా? సరైన అనుమతులు, భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నాయా? లేదా? అన్నది అధికారుల తనిఖీలతోనే తేలాలి. ఒకటి రెండు హాస్టళ్లపై తూతూమంత్రంగా చర్యలు తీసుకోకుండా, ఈ మొత్తం కో-లివింగ్ వ్యవస్థపై మున్సిపల్, పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
ఉద్యోగాల కోసం వచ్చి అద్దె గదులు వెతుక్కునే యువతకు వసతి కల్పించడం ఎంత ముఖ్యమో, స్థానిక ప్రాంతాల సాంస్కృతిక వాతావరణాన్ని, భద్రతను కాపాడటం కూడా అంతే ముఖ్యం. నిబంధనలను గాలికి వదిలేసి, అక్రమంగా నడుస్తున్న ఇలాంటి కో-లివింగ్ హాస్టళ్లపై అధికారులు తక్షణమే కొరడాఝుళిపించి, పూర్తి స్థాయి పర్యవేక్షణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.




