Dasara Holidays: తెలంగాణ స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పటినుంచంటే.. SA-1 పరీక్షల షెడ్యూల్ ఇదే!

తెలంగాణలో 1 నుంచి 10వ తరగతి వరకు SA-1 పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 9 వరకు జరగనున్నాయి. దసరా సెలవులు అక్టోబర్ 10 నుంచి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 17 Sept 2026 12:40 AM IST
Telangana School Holidays
X

Telangana School Holidays

Telangana School Holidays: తెలంగాణలో పాఠశాల విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షల షెడ్యూల్‌తో పాటు దసరా సెలవుల వివరాలను ప్రకటించింది.

విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. SA-1 పరీక్షలు అక్టోబర్ 1 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు పూర్తయిన అనంతరం అక్టోబర్ 10 నుంచి 22వ తేదీ వరకు పాఠశాలలకు దసరా సెలవులు ఉండనున్నాయి.

తరగతుల వారీగా పరీక్షల సమయాలు

పరీక్షల నిర్వహణలో భాగంగా తరగతులను బట్టి వేర్వేరు సమయాలను నిర్ణయించారు.

1 నుంచి 5వ తరగతి: ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు

6, 8వ తరగతులు: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు

7వ తరగతి: మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు

9వ తరగతి: మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు

10వ తరగతి: ఉదయం 9:15 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు

వివిధ తరగతులకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలతో కూడిన పూర్తి టైమ్‌టేబుల్‌ను కూడా విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

దసరా సెలవులు ఎప్పటినుంచి?

తెలంగాణలోని పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. దీంతో SA-1 పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులకు సెలవులు ప్రారంభం కానున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్