Telecom Tariff Hike: కస్టమర్లకు బిగ్ షాక్.. రీఛార్జ్ ధరలు పెరిగే ఛాన్స్!

Telecom Tariff Hike: మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను 10 నుంచి 20 శాతం పెంచేందుకు టెలికం కంపెనీలు సన్నాహాలు చేస్తున్నట్లు కేర్ ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 Sept 2026 1:36 AM IST
Telecom Tariff Hike
X

Telecom Tariff Hike: కస్టమర్లకు బిగ్ షాక్.. రీఛార్జ్ ధరలు పెరిగే ఛాన్స్!

Telecom Tariffs: దేశంలోని మొబైల్ వినియోగదారులకు త్వరలోనే మరో ఆర్థిక భారం పడనుంది. దేశీయ ప్రముఖ టెలికం కంపెనీలు రీఛార్జ్ ప్లాన్ల ధరలను (టారిఫ్‌లు) పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ‘కేర్ ఎడ్జ్ రేటింగ్స్’ (CareEdge Ratings) వెల్లడించింది. నెట్‌వర్క్ విస్తరణ, ప్రతి వినియోగదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) కనీసం 10 శాతం మేర పెంచుకోవడమే లక్ష్యంగా కంపెనీలు ఈ నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలిపింది. దీనివల్ల వివిధ రీఛార్జ్ ప్లాన్ల ధరలు 10 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా 5G మౌలిక సదుపాయాల కల్పన మరియు సేవల నాణ్యత పెంపు పేరిట టెలికం దిగ్గజాలు వరుసగా టారిఫ్‌లను సవరిస్తూనే ఉన్నాయి. 2019 డిసెంబర్‌లో 15-40%, 2021 డిసెంబర్‌లో 20%, మరియు జులై 2024లో 10-25% వరకు ప్లాన్ల ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోమారు టారిఫ్‌ల పెంపునకు సన్నాహాలు చేస్తుండటంతో, సామాన్య మరియు మధ్యతరగతి ప్రజల నెలవారీ ఇంటర్నెట్, కాలింగ్ ఖర్చులు మరింత భారం కానున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్