Stock market: రూ. 3 నుంచి రూ. 320కి.. ఆరేళ్లలోనే కోటీశ్వరుల్ని చేసిన స్టాక్
Stock market: ఆరేళ్లలో రూ. 3 నుంచి రూ. 320 స్థాయికి చేరి ఇన్వెస్టర్లను కోటీశ్వరులను చేసిన ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ స్టాక్ గురించి తెలుసుకోండి.
Stock market: రూ. 3 నుంచి రూ. 320కి.. ఆరేళ్లలోనే కోటీశ్వరుల్ని చేసిన స్టాక్
Multibagger stocks: స్టాక్ మార్కెట్ అంటేనే ఒక అంతుచిక్కని సముద్రం. ఇక్కడ రాత్రికి రాత్రే సంపద ఆవిరైపోవచ్చు.. లేదా ఓపికతో ఉంటే కాసుల వర్షం కురియవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు, ఆర్థిక అనిశ్చితి వల్ల మార్కెట్లు పతనమవుతున్న వేళ.. ఒక స్టాక్ మాత్రం దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలను అందించింది. అదే ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ (ఇండియా) లిమిటెడ్.
లక్ష పెట్టుబడి.. కోటి రూపాయల లాభం
నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం. 2020 ఏప్రిల్ సమయంలో ఈ కంపెనీ షేరు ధర కేవలం రూ. 3 మాత్రమే. కానీ ఆరేళ్లు తిరగకముందే, అంటే నేడు ఈ స్టాక్ రూ. 320 స్థాయికి చేరుకుంది.అంటే, ఆరేళ్ల క్రితం ఎవరైనా ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, నేడు దాని విలువ ఏకంగా రూ. 1.05 కోట్లు అయ్యేది.స్వల్పకాలిక ఒడిదుడుకులకు భయపడకుండా దీర్ఘకాలం పాటు వేచి చూసిన వారికి ఈ స్టాక్ 'కుబేరులను' చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల భారత స్టాక్ మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. ఏప్రిల్ 23 సెషన్‌లో సెన్సెక్స్ 850 పాయింట్లు పతనమై 77,664 వద్ద, నిఫ్టీ 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద స్థిరపడ్డాయి. మార్చి నెలలోనైతే సెన్సెక్స్ ఏకంగా 11 శాతం కుప్పకూలింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా, ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ స్టాక్ గురువారం సెషన్‌లో 3 శాతం లాభపడి రూ. 324.20 వద్ద గరిష్టాన్ని తాకడం విశేషం.
కంపెనీ ఆర్థిక స్థితిగతులు
కేవలం అదృష్టం వల్లే స్టాక్ ధర పెరగదు, కంపెనీ ఆర్థిక ఫలితాలు కూడా బలంగా ఉండాలి.2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ. 2,395 కోట్లుగా నమోదైంది. 20 శాతం పెరిగి రూ. 225 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.86 వేల కోట్లుగా ఉంది.
ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక
మల్టీబ్యాగర్ రిటర్న్స్ కనిపిస్తున్నా, స్టాక్ మార్కెట్‌లో రిస్క్ ఎప్పుడూ పొంచి ఉంటుంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 594 కాగా, కనిష్ట ధర రూ. 224 గా ఉంది. అంటే ఏడాది కాలంలో ఈ స్టాక్ భారీగా పడిపోయింది. గత ఏడాది లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఇప్పుడు కేవలం రూ. 56,590 మాత్రమే మిగిలాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే.. మార్కెట్‌లో స్వల్పకాలిక లాభాల కంటే దీర్ఘకాలిక లక్ష్యాలే శ్రీరామరక్ష. ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టే ముందు కంపెనీ గత ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలు , అంతర్జాతీయ పరిస్థితులను గమనించాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని, ఓపికతో పెట్టుబడిని కొనసాగించినప్పుడే ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ వంటి మల్టీబ్యాగర్ లాభాలను అందుకోవడం సాధ్యమవుతుంది.
గమనిక: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.




