Upasana Konidela: అపోలోలో కీలక బాధ్యతలు చేపట్టిన ఉపాసన..!
Upasana Konidela: అపోలో హాస్పిటల్స్ ప్రాజెక్ట్స్ విభాగానికి డైరెక్టర్‌గా ఉపాసన కొణిదెల నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా రూ.8,600 కోట్ల విస్తరణ ప్రణాళికలను ఆమె పర్యవేక్షించనున్నారు.
Upasana Konidela: అపోలోలో కీలక బాధ్యతలు చేపట్టిన ఉపాసన..!
Upasana Konidela: ప్రముఖ హెల్త్‌కేర్ దిగ్గజం అపోలో హాస్పిటల్స్ "ప్రాజెక్ట్స్" విభాగానికి మెగా కోడలు, నటుడు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కామినేని కొణిదెల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే అపోలో హాస్పిటల్స్ గ్రూప్ సీఎస్ఆర్ (CSR) విభాగానికి వైస్ ఛైర్‌పర్సన్‌గా సేవలందిస్తున్న ఆమె, ఇకపై డైరెక్టర్ హోదాలో దేశవ్యాప్తంగా ఆసుపత్రి ప్రాజెక్టుల అభివృద్ధిని పర్యవేక్షించనున్నారు.
ఆసుపత్రి విస్తరణ ప్రణాళికల్లో భాగంగా అపోలో హాస్పిటల్స్ సంస్థ రూ. 8,600 కోట్లు భారీ పెట్టుబడులు పెట్టేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఉపాసన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అందరికీ ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించాలన్న తమ తాతగారు డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడం తనపై ఉన్న బాధ్యతగా ఆమె పేర్కొన్నారు.
అపోలో హాస్పిటల్స్‌తో పాటు డిజిటల్ వెల్నెస్, కార్పొరేట్ ప్లాట్‌ఫామ్ అయిన 'యువర్‌లైఫ్' (URlife) కు కూడా ఉపాసన మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ వ్యాపార రంగంలోనూ దూసుకెళ్తున్నారు.




