UPI New Rules: మీరు చేసే ప్రతి యూపీఐ పేమెంట్పై ఛార్జీ పడుతుందా?: నిపుణులు చెబుతున్న అసలు విషయాలు ఇవే!
UPI New Rules: యూపీఐ లావాదేవీలపై వస్తున్న ఛార్జీల వార్తలపై క్లారిటీ వచ్చేసింది.
UPI New Rules: మీరు చేసే ప్రతి యూపీఐ పేమెంట్పై ఛార్జీ పడుతుందా?: నిపుణులు చెబుతున్న అసలు విషయాలు ఇవే!
UPI New Rules: ఇన్నాళ్లూ ఉచితంగా సాగిన యూపీఐ సేవలకు సంబంధించి వస్తున్న వార్తలు, ప్రచారాలపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేలా పూర్తి స్పష్టత వచ్చింది. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి వస్తున్న కొత్త నిబంధనల ప్రకారం.. సామాన్యులపై ఎలాంటి అదనపు భారం పడదని, యూపీఐ లావాదేవీలు యథావిధిగా సురక్షితంగా కొనసాగనున్నాయని స్పష్టమైంది.
వ్యక్తిగత చెల్లింపులు పూర్తిగా ఉచితం:
స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఎంత మొత్తమైనా (రూ.10 వేలైనా, రూ.50 వేలైనా) పంపుకుంటే ఎలాంటి ఛార్జీ ఉండదు.
రూ.2 వేల వరకు వ్యాపార చెల్లింపులు ఫ్రీ:
కిరాణా షాపులు, హోటళ్లలో రూ.2,000 వరకు యూపీఐ ద్వారా చెల్లించే బిల్లులపై అదనంగా ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.
ఎండీఆర్ (MDR) ఎవరికి వర్తిస్తుంది?:
ఒక వ్యాపారికి రూ.2,000 కంటే ఎక్కువ చెల్లింపులు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో 0.4 శాతం ఎండీఆర్ వర్తిస్తుంది. అయితే ఈ ఛార్జీని కస్టమర్ చెల్లించాల్సిన అవసరం లేదు.. కేవలం వ్యాపారే భరించాలి.
పెట్రోల్, ఇంధన చెల్లింపులు:
పెట్రోల్ బంకులు, రైల్వే, ఇన్సూరెన్స్ వంటి రంగాల్లో రూ.2 వేలు దాటితే రూ.5 ఫ్లాట్ ఎండీఆర్ ఉంటుంది. ఇది కూడా వ్యాపారి మాత్రమే చెల్లించాలి. కస్టమర్ల నుంచి వసూలు చేయడానికి నిబంధనలు అంగీకరించవు.
చిన్న వ్యాపారులకు మినహాయింపు:
నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ టర్నోవర్ కలిగిన చిన్న కిరాణా దుకాణాలు, వీధి వ్యాపారులకు 'జీరో ఎండీఆర్' సదుపాయం యథావిధిగా కొనసాగుతుంది.




