Cognizant Green Card: కాగ్నిజెంట్ గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా నిషేధం!
Cognizant Green Card: అమెరికాలో కాగ్నిజెంట్ గ్రీన్ కార్డ్ దరఖాస్తుల నిలిపివేత. విదేశీ ఉద్యోగుల మోసంపై ఫెడరల్ అధికారుల దర్యాప్తు వేగవంతం.
Cognizant Green Card: కాగ్నిజెంట్ గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై అమెరికా నిషేధం!
Cognizant Green Card: ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం 'కాగ్నిజెంట్' సంస్థకు అమెరికా ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కంపెనీ నిర్వహించే శాశ్వత కార్మిక ధృవీకరణ దరఖాస్తులను నిలిపివేస్తున్నట్లు అమెరికా కార్మిక శాఖ మంగళవారం వెల్లడించింది. విదేశీ ఉద్యోగులకు ఉపాధి ఆధారిత 'గ్రీన్ కార్డ్' సాధించడంలో పీఈఆర్‌ఎమ్ ప్రక్రియ అత్యంత కీలకమైనది.
కాగ్నిజెంట్ సంస్థలో జరిగినట్లు భావిస్తున్న విదేశీ నియామకాల మోసం, తద్వారా స్థానిక అమెరికన్ కార్మికులకు వాటిల్లిన నష్టంపై ఫెడరల్ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. వైట్ హౌస్ మోస నిరోధక టాస్క్ ఫోర్స్‌తో కలిసి విచారణ చేపడుతున్నట్లు కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంథోనీ డి'ఎస్పోసిటో స్పష్టం చేశారు. అయితే, ఎంతమంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడుతుందనే వివరాలను అధికారులు ఇంకా బయటపెట్టలేదు.
అమెరికా వ్యాప్తంగా 1,500 మంది స్థానిక గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంతో పాటు AI ఆధారిత విభాగాల్లో 15,000 మంది ఇంజనీర్లను విస్తరిస్తామని కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ ఎస్ ప్రకటించిన మరుసటి రోజే అమెరికా ప్రభుత్వం ఈ కఠిన చర్య తీసుకోవడం గమనార్హం.




