Vi Prepaid Family Plan: రీఛార్జ్‌పై డిస్కౌంట్‌తోపాటు డేటా షేరింగ్.. వీఐ నుంచి కొత్త ఫ్యామిలీ ప్లాన్ లాంచ్..!
Vi Prepaid Family Plan: ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం Vi ఈ ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో కుటుంబ సభ్యులు భారత్‌లోని ఏ నగరంలో ఉన్నప్పటికీ వారితో మొబైల్ డేటాను పంచుకోవచ్చు.
Vi Prepaid Family Plan: రీఛార్జ్‌పై డిస్కౌంట్‌తోపాటు డేటా షేరింగ్.. వీఐ నుంచి కొత్త ఫ్యామిలీ ప్లాన్ లాంచ్..!
Vi Prepaid Family Plan: వోడాఫోన్ ఐడియా (Vi) సరికొత్త ఫ్యామిలీ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఇది ఒక ప్రత్యేకమైన సర్వీస్. ఇందులో యూజర్లు Vi యాప్ ద్వారా ఫ్యామిలీ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. అలాగే ఇతర కుటుంబ సభ్యులతో మొబైల్ డేటాను షేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, రీఛార్జ్‌లపై 10 శాతం వరకు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం Vi ఈ ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో కుటుంబ సభ్యులు భారత్‌లోని ఏ నగరంలో ఉన్నప్పటికీ వారితో మొబైల్ డేటాను పంచుకోవచ్చు. అలాగే ఫ్యామిలీ ప్లాన్ తీసుకున్న వారికి ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లపై 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
'వీఐ పే సబ్ హై వీఐపీ' అనే ట్యాగ్‌లైన్‌తో సంస్థ దీనిని పరిచయం చేసింది. ప్రీపెయిడ్ యూజర్లను పూల్డ్ సపోర్ట్ మోడల్లోకి తీసుకురావడానికి కంపెనీ ఈ ప్రయత్నం చేసింది. దీని ద్వారా యూజర్లు తమ డేటా కోటాను కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి వీలవుతుంది.
ఈ ఫీచర్‌ను వివరంగా వివరించడానికి Vi ఒక వీడియోను కూడా విడుదల చేసింది. Vi యాప్ సాయంతో ముందుగా ఒక 'ఫ్యామిలీ డ్యాష్‌బోర్డ్' క్రియేట్ చేసుకోవాలని, ఆ తర్వాత ఆ డ్యాష్‌బోర్డ్‌లో కుటుంబ సభ్యులను యాడ్ చేయాలని అందులో పేర్కొంది.
'సెండ్' పై క్లిక్ చేస్తే చాలు..
Vi యాప్‌లో ఒకసారి డ్యాష్‌బోర్డ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, వినియోగదారులు తమ కుటుంబ సభ్యులతో సులభంగా డేటాను షేర్ చేయవచ్చు. దీనికోసం ఫ్యామిలీ డ్యాష్‌బోర్డ్‌కి వెళ్లి 'సెండ్'పై క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంటనే సదరు యూజర్‌కు 500MB డేటా చేరుతుంది.
500MB వరకు డేటా షేరింగ్..
ఫ్యామిలీ డేటా షేరింగ్ కింద రోజుకు 500MB వరకు డేటాను పంపుకోవచ్చు. దీని వ్యాలిడిటీ ఆ రోజు అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది. వినియోగదారులు వారానికి రెండు సార్లు, నెలకు గరిష్టంగా నాలుగు సార్లు మాత్రమే మొబైల్ డేటాను షేర్ చేయడానికి వీలుంటుంది.
గరిష్టంగా నలుగురు సభ్యులకు అవకాశం..
Vi ప్రీపెయిడ్ ఫ్యామిలీ గ్రూప్‌లో గరిష్టంగా నలుగురిని చేర్చుకోవచ్చు. ఇందులో ఒకరు ప్రైమరీ మెంబర్ కాగా, మిగిలిన వారు సెకండరీ మెంబర్లుగా ఉంటారు. వీరు దేశంలోని ఏ టెలికాం సర్కిల్‌కు చెందినవారైనా కావచ్చు. అయితే డేటా ప్రయోజనం పొందడానికి ప్రతి సభ్యుడి వద్ద యాక్టివ్ ప్రీపెయిడ్ ప్లాన్ ఉండటం తప్పనిసరి.




