Wealth Tips: ఇల్లు, కారు ఉంటేనే కాదు ఈ నాలుగు ఉంటే.. మీరు కూడా ధ‌నవంతులే

Wealth Tips: సమాజంలో చాలామంది సంపదను ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇళ్లు, బ్రాండెడ్ వస్తువులతో కొలుస్తారు.

Mokshith
Published on: 31 May 2026 5:42 PM IST
Wealth Tips
X

Wealth Tips: ఇల్లు, కారు ఉంటేనే కాదు ఈ నాలుగు ఉంటే.. మీరు కూడా ధ‌నవంతులే

Wealth Tips: సమాజంలో చాలామంది సంపదను ఖరీదైన కార్లు, విలాసవంతమైన ఇళ్లు, బ్రాండెడ్ వస్తువులతో కొలుస్తారు. కానీ నిజమైన ఆర్థిక బలం వాటితో నిర్ణ‌యించేల‌ము. ఒక వ్యక్తి ఎంత ఆర్థికంగా స్థిరంగా ఉన్నాడో అతని డబ్బు నిర్వహణ, పొదుపు అలవాట్లు, అప్పుల నియంత్రణ వంటి అంశాలు చెబుతాయి.

అత్యవసర సమయంలో రూ.1 లక్ష ఖర్చు చేయగలగడం

ఆర్థిక భద్రతకు మొదటి గుర్తు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం. ఉదాహరణకు అకస్మాత్తుగా ఆసుపత్రి ఖర్చులు, వాహన మరమ్మతులు లేదా ఇతర అవసరాల కోసం రూ.1 లక్ష అవసరమైతే, ఆ మొత్తాన్ని సులభంగా సమకూర్చగలగాలి. దాని కోసం బంగారం అమ్మడం, పెట్టుబడులు విరమించుకోవడం లేదా అప్పు చేయాల్సిన పరిస్థితి రాకపోతే మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉన్నట్టే. అత్యవసర నిధి (Emergency Fund) కలిగి ఉండటం ఆర్థిక స్వాతంత్రానికి ముఖ్యమైన సూచిక.

అధిక వడ్డీ అప్పుల నుంచి దూరంగా ఉండటం

ఎంత సంపాదిస్తున్నామన్నదానికంటే అప్పులను ఎలా నిర్వహిస్తున్నామన్నదే ముఖ్యమైనది. ముఖ్యంగా అధిక వడ్డీ ఉన్న వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డ్ బకాయిలు వంటి అప్పులు ఆర్థిక స్థితిని దెబ్బతీస్తాయి. 10 శాతానికి మించిన వడ్డీతో ఉన్న రుణాలను ఎక్కువ కాలం కొనసాగించడం మంచిది కాదు. అలాంటి అప్పులను త్వరగా తీర్చగలిగితే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది. అధిక వడ్డీ అప్పులు లేకపోవడం ఆర్థికంగా బలంగా ఉన్నారనే సంకేతంగా పరిగణించబడుతుంది.

ప్రతి నెల ఆదాయంలో కొంత భాగం పెట్టుబడిగా పెట్టడం

నిజమైన సంపద ఒక్కరోజులో ఏర్పడదు. క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే దీర్ఘకాలిక ఆర్థిక భద్రత సాధ్యమవుతుంది. మీ నెలవారీ ఆదాయంలో కనీసం 15 నుంచి 20 శాతం వరకు పెట్టుబడుల కోసం కేటాయిస్తే మీరు సరైన దారిలో ఉన్నట్టే. పీపీఎఫ్, ఈపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీ, షేర్లు వంటి పెట్టుబడులు భవిష్యత్తులో సంపద సృష్టించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా పెట్టుబడులను మధ్యలో ఉపసంహరించకుండా కొనసాగించడం చాలా ముఖ్యం.

ఇతరులను చూసి ఖర్చు చేయకపోవడం

చాలామంది తమ స్థోమత కంటే ఎక్కువగా ఖర్చు చేస్తూ ఇతరులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ నిజంగా ఆర్థికంగా తెలివైన వ్యక్తులు అలాంటి పోటీలకు దూరంగా ఉంటారు. పక్కింటివారు కొత్త కారు కొనుగోలు చేశారని, స్నేహితులు ఖరీదైన వస్తువులు వాడుతున్నారని అనవసర ఖర్చులు చేయరు. తమ కుటుంబ భవిష్యత్తు లక్ష్యాలపైనే దృష్టి పెడతారు. ఆర్థిక క్రమశిక్షణే సంపదకు అసలు పునాది అని వారు నమ్ముతారు.

నిజమైన సంపద అంటే ఏమిటి?

నిజమైన ధనవంతులు తమ సంపదను ప్రదర్శించడానికి కాకుండా, దానిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారి లక్ష్యం విలాసవంతమైన జీవితం చూపించడం కాదు, ఆర్థిక స్వేచ్ఛను సాధించడం. ఎమర్జెన్సీ ఫండ్ ఉండటం, అధిక వడ్డీ అప్పులు లేకపోవడం, క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం, అవసరం లేని ఖర్చులను నియంత్రించడం వంటి లక్షణాలు ఉంటే మీరు ఇప్పటికే దేశంలోని చాలా మంది ప్రజల కంటే మెరుగైన ఆర్థిక స్థితిలో ఉన్నట్టే.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story