EMI: ఈఎంఐ గడువులోగా చెల్లించకపోతే ఏమవుతుంది.? సులభమైన పరిష్కారాలు ఏంటో తెలుసా.!
EMI: ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే చార్జీల మోత, సిబిల్ స్కోర్ పతనం తప్పవు. పరిష్కారాలు ఏంటో ఇప్పుడే తెలుసుకుందామా.
EMI: ఈఎంఐ గడువులోగా చెల్లించకపోతే ఏమవుతుంది.? సులభమైన పరిష్కారాలు ఏంటో తెలుసా.!
EMI: ప్రస్తుత రోజుల్లో ఇల్లు, కారు కొనుగోలుతో పాటు వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణాన్ని ప్రతినెలా ఈఎంఐ రూపంలో క్రమం తప్పకుండా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఏదైనా ఆర్థిక ఇబ్బందుల వల్ల రుణాలకు గడువులోగా ఈఎంఐ చెల్లించకపోతే ఖాతాదారులపై బ్యాంకులు భారీగా లేట్ ఫీజులు, పెనాల్టీ చార్జీలు విధిస్తాయి. సాధారణంగా ఒక్కో ఈఎంఐ బౌన్స్ అయినప్పుడు బ్యాంకులు రూ. 500 నుంచి రూ. 1 వేయి వరకు అదనపు చార్జీలు వసూలు చేస్తాయి.
ఈఎంఐ ఎగవేత వల్ల ఎదురయ్యే ప్రధాన సమస్యలు:
• మొదటిగా క్రెడిట్ స్కోరు పడిపోవడం. ఒక్క ఈఎంఐ చెల్లించకపోయినా సిబిల్ రికార్డుల్లో డిఫాల్టర్‌గా నమోదవుతుంది.
- భవిష్యత్తులో అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు బ్యాంకుల నుంచి కొత్త రుణాలు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
- వరుసగా 90 రోజుల పాటు అసలు లేదా వడ్డీ చెల్లించకపోతే ఆ లోన్ ఖాతాను బ్యాంకులు నిరర్థక ఆస్తిగా (నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) ప్రకటిస్తాయి.
- రుణం ఎన్‌పీఏగా మారిన తర్వాత బ్యాంకులు బకాయిల రికవరీ కోసం నోటీసులు జారీ చేసి చట్టపరమైన చర్యలు చేపడతాయి. నిబంధనల ప్రకారం లీగల్ చర్యలు, చట్టపరమైన శిక్షలకు గురికావాల్సి వస్తుంది.
ఏవైనా ఊహించని కారణాల వల్ల రుణం చెల్లించలేని పరిస్థితి ఏర్పడితే భయపడకుండా నేరుగా బ్యాంకు అధికారులను సంప్రదించి అందుబాటులో ఉన్న పరిష్కారాలను తెలుసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకులు ఖాతాదారుల పరిస్థితిని బట్టి పలు ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తాయి:
లోన్ రీషెడ్యూలింగ్: రుణం తిరిగి చెల్లించే కాలాన్ని (టెన్యూర్) పెంచుకోవచ్చు. దీనివల్ల ప్రతినెలా కట్టాల్సిన ఈఎంఐ భారం తగ్గుతుంది. ఉదాహరణకు నెలకు రూ. 30 వేలు కట్టాల్సిన చోట కాలపరిమితి పెంచి దానిని రూ. 15 వేలు లేదా రూ. 20 వేలు వరకు తగ్గించుకోవచ్చు.
మారటోరియం: ఉద్యోగం కోల్పోవడం లేదా తీవ్ర అనారోగ్యం వంటి ప్రత్యేక సందర్భాల్లో కొన్ని నెలల పాటు ఈఎంఐ చెల్లింపులకు తాత్కాలిక విరామం పొందే అవకాశం ఉంటుంది.
లోన్ రీస్ట్రక్చరింగ్: వడ్డీ రేట్లను సవరించుకోవడం లేదా రుణ ఒప్పందాన్ని పునర్వ్యవస్థీకరించడం ద్వారా భారాన్ని తగ్గించుకోవచ్చు.
సమస్య తలెత్తిన వెంటనే బ్యాంకుతో మాట్లాడటం వల్ల చట్టపరమైన ఇబ్బందులను సులభంగా నివారించవచ్చు. ఈఎంఐ డిఫాల్ట్ కాకుండా చూసుకోవడమే ఆర్థిక క్రమశిక్షణకు మొదటి మెట్టు.




