Whatsapp: వాట్సాప్ కాల్స్‌లో సరికొత్త ఫీచర్.. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌కు చెక్ పెట్టండిలా!
వాట్సాప్ తన ఐఫోన్ వినియోగదారుల కోసం ఒక సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇకపై కాల్స్ మాట్లాడుతున్నప్పుడే బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్‌ను కంట్రోల్ చేసేందుకు మైక్ మోడ్స్‌ను మార్చుకోవచ్చు.
Whatsapp: వాట్సాప్ కాల్స్‌లో సరికొత్త ఫీచర్.. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌కు చెక్ పెట్టండిలా!
Whatsapp: ఐఫోన్ వినియోగదారులకు వాట్సాప్ ఒక శుభవార్తను అందించింది. ఇకపై వాయిస్ లేదా వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించుకోవడానికి లేదా పెంచుకోవడానికి మైక్రోఫోన్ మోడ్స్‌ను నేరుగా యాప్ నుండే మార్చుకునే వీలు కల్పించింది. ఇప్పటివరకు ఈ ఆప్షన్లు కావాలంటే ఐఫోన్ కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు వాట్సాప్ కాల్ స్క్రీన్‌పైనే వీటిని అందుబాటులో ఉంచారు.
తాజా అప్‌డేట్(వెర్షన్ 26.27.74) ద్వారా కాల్ స్క్రీన్‌పై ఉన్న “More” బటన్‌ను క్లిక్ చేస్తే, “Mic Mode” అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇందులో నాలుగు రకాల మోడ్స్ ఉంటాయి:
Standard: ఇది సాధారణ ఆడియో క్వాలిటీ కోసం ఉపయోగపడుతుంది.
Voice Isolation: చుట్టుపక్కల శబ్దాలను అణచివేసి, మీ వాయిస్‌ను స్పష్టంగా వినిపిస్తుంది.
Wide Spectrum: బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ కూడా అవతలి వారికి వినిపించాలనుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది.
Automatic: పరిస్థితులను బట్టి ఏ మోడ్ ఉత్తమమో ఫోనే నిర్ణయిస్తుంది.
కాగా, ఒకసారి మీరు ఒక మైక్ మోడ్‌ను సెలెక్ట్ చేసుకుంటే, తర్వాత చేసే కాల్స్‌కు కూడా అవే సెట్టింగ్స్ కొనసాగుతాయి. ఈ ఫీచర్ క్రమంగా అందరు వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.




