Loans: రెపో రేటు తగ్గినా బ్యాంకులు EMIలు ఎందుకు తగ్గించలేవు.. అసలు కారణం ఏంటంటే.?
Loans: భారతీయ రిజర్వ్ బ్యాంక్ రేపో రేటు తగ్గించినప్పటికీ, ఆ ప్రయోజనం పూర్తిగా కస్టమర్లకు చేరలేదని తాజా నివేదిక చెబుతోంది. లోన్ తీసుకున్న వారికి EMIలు గణనీయంగా తగ్గలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు సులభంగా చూద్దాం.
Loans
Loans: భారతీయ రిజర్వ్ బ్యాంక్ రేపో రేటు తగ్గించినప్పటికీ, ఆ ప్రయోజనం పూర్తిగా కస్టమర్లకు చేరలేదని తాజా నివేదిక చెబుతోంది. లోన్ తీసుకున్న వారికి EMIలు గణనీయంగా తగ్గలేదని తెలుస్తోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇప్పుడు సులభంగా చూద్దాం.
RBI రేటు తగ్గింపు – అసలు లక్ష్యం ఏమిటి?
2026 ఫిబ్రవరి నుంచి RBI రేపో రేటును 6.50% నుంచి 5.25%కి తగ్గించింది. అంటే మొత్తం 125 బేసిస్ పాయింట్ల తగ్గింపు జరిగింది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రజలు తక్కువ వడ్డీతో లోన్ తీసుకోవడం, పెట్టుబడులు పెరగడం. కానీ ఈ తగ్గింపు పూర్తిగా అమలులోకి రాలేదు.
బ్యాంకులు ఎందుకు పూర్తి లాభం ఇవ్వలేకపోయాయి?
బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించినా, అది RBI తగ్గించినంతగా లేదు. దీనికి కారణం డిపాజిట్ రేట్లు, ఫండ్స్ ఖర్చు మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం. అంటే బ్యాంకులు తమ లాభాలను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నాయి.
లోన్ వడ్డీలు ఎంతవరకు తగ్గాయి.?
కొత్తగా ఇచ్చే లోన్లపై వడ్డీ సగటుగా 0.93% మాత్రమే తగ్గింది. అలాగే MCLR (బ్యాంకుల అంతర్గత బెంచ్‌మార్క్ రేటు) కేవలం 0.45% మాత్రమే తగ్గింది. ఇది రేటు తగ్గింపు ప్రభావం నెమ్మదిగా జరిగిందని చూపిస్తోంది.
ఏ బ్యాంకుల్లో ఎక్కువ ప్రయోజనం కనిపించింది?
విదేశీ బ్యాంకులు రేట్లు ఎక్కువగా తగ్గించాయి. తర్వాత ప్రైవేట్ బ్యాంకులు, చివరగా ప్రభుత్వ బ్యాంకులు ఉన్నాయి. EBLR (External Benchmark Linked Rate)కి ఎక్కువగా లింక్ అయిన లోన్లలో తగ్గింపు త్వరగా కనిపించింది. ముఖ్యంగా రిటైల్, MSME లోన్లలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఏ రంగాలకు ఎక్కువ లాభం?
హౌసింగ్ లోన్లు తక్కువ వడ్డీతో లభించాయి (సుమారు 7.63%). ఎడ్యుకేషన్, ఎగుమతి లోన్లలో భారీగా తగ్గుదల కనిపించింది. కానీ వ్యవసాయం, పెద్ద పరిశ్రమలలో మాత్రం తగ్గుదల చాలా తక్కువగా ఉంది. మొత్తం మీద వడ్డీ తగ్గింపుతో దాదాపు రూ. 19,000 కోట్ల వరకు సేవింగ్ జరిగింది.




