Gold: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా.? నిపుణులు ఏం చెప్పారంటే.?

Gold: బంగారం, వెండి కొనాలనుకునేవారికి మార్కెట్ నిపుణులు కీలక అప్‌డేట్ అందించారు.

Ravi
By Ravi
Published on: 24 Jun 2026 7:36 PM IST
Gold
X

Gold: బంగారం ధరలు ఇంకా తగ్గుతాయా.? నిపుణులు ఏం చెప్పారంటే.?

Gold: బంగారం, వెండి కొనాలనుకునేవారికి మార్కెట్ నిపుణులు కీలక అప్‌డేట్ అందించారు. రాబోయే రోజుల్లో పసిడి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందా? అంతర్జాతీయ మార్కెట్లలో జరుగుతున్న మార్పులు పసిడిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఇక్కడ తెలుసుకోండి.

భారతదేశంలో బంగారం, వెండి అంటే కేవలం ఆభరణాలు మాత్రమే కాదు.. అదొక సురక్షితమైన పెట్టుబడి మార్గంగా, సెంటిమెంట్‌గా ప్రజలు భావిస్తారు. అందుకే ప్రతిరోజూ ఉదయం లేవగానే పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపుతుంటారు. గత కొన్ని రోజులుగా పసిడి మార్కెట్‌లో తీవ్రమైన ఒడిదొడుకులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా తగ్గుతాయా? లేదా మళ్లీ పెరుగుతాయా? అనే ప్రశ్న సాధారణ వినియోగదారులతో పాటు ఇన్వెస్టర్లలోనూ మెదులుతోంది. ఈ విషయమై అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్‌ను గమనిస్తున్న ట్రేడ్ వర్గాలు కీలకమైన అంచనాలను వెల్లడించాయి.

ట్రేడ్ వర్గాల విశ్లేషణ ప్రకారం, బంగారం, వెండి ధరలకు మరికొన్ని రోజుల పాటు ఒడుదొడుకులు తప్పేలా లేవు. అంతేకాకుండా, ఈ గందరగోళ పరిస్థితుల క్రమంలో ధరలు మరింత తగ్గే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పసిడి ధరలు ఇలా క్షీణించడానికి అంతర్జాతీయంగా ప్రధానంగా మూడు బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది ప్రపంచ మార్కెట్లో అమెరికన్ డాలర్ విపరీతంగా బలపడటం, రెండోది యూఎస్ బాండ్ యీల్డ్స్ భారీగా పెరగడం, మూడోది ఈ ఏడాదిలో వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందంటూ అమెరికాకు చెందిన ఫెడరల్ రిజర్వ్ హింట్ ఇవ్వడం. ఈ పరిణామాలన్నీ ప్రస్తుతం పసిడి పతనానికి దారితీస్తున్నాయి.

మార్కెట్‌లో వడ్డీ రేట్లు తక్కువగా ఉండి, డాలర్ విలువ క్షీణించినప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి గోల్డ్ వైపు మొగ్గు చూపుతారు. ఆ సమయంలో బంగారం ధరలు విపరీతంగా రాణిస్తాయి. కానీ, ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు ఇందుకు పూర్తిగా ప్రతికూలంగా మారాయి. డాలర్ ఇండెక్స్, బాండ్ రేట్లు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ ప్రతికూల పరిస్థితులే ఇప్పుడు పసిడికి పెద్ద సవాల్‌గా మారాయని స్పష్టం చేస్తోంది. కాబట్టి పసిడి ధరల్లో స్థిరత్వం వచ్చే వరకు కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు అంతర్జాతీయ మార్కెట్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story