Annamayya: బోయకొండ భక్తుల వాహనాన్ని ఢీకొన్న లారీ.. 16 మందికి గాయాలు
Annamayya: మదనపల్లె బైపాస్ రోడ్డులో ఐచర్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో 16 మంది బోయకొండ భక్తులకు గాయాలయ్యాయి.
Annamayya: బోయకొండ భక్తుల వాహనాన్ని ఢీకొన్న లారీ.. 16 మందికి గాయాలు
అన్నమయ్య జిల్లా: మదనపల్లె బైపాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బోయకొండకు వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న ఐచర్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో 16 మంది గాయపడ్డారు. గాయపడిన వారంతా అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లుకు చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయం లేదని రెండవ పట్టణ సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ, అనంతరం జిల్లా ఆస్పత్రికి చేరుకుని బాధితులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Next Story




