Madanapalle: బాబు కాలనీ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం!

Madanapalle: మదనపల్లె బాబు కాలనీ హైస్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు జాతీయ జెండా ఆవిష్కరణ, ప్రతిభా పురస్కారాల అందజేత.

Srinivasulu, Madanapalle
Published on: 16 Aug 2026 8:14 AM IST
Madanapalle
X

Madanapalle: బాబు కాలనీ హైస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం!

Madanapalle: మదనపల్లె బాబు కాలనీ హైస్కూల్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 35వ వార్డు ఇంచార్జ్, స్నేహ మెడికల్స్ రమేష్ రెడ్డి, మోహన్ రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ శ్రీనాథ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు, విద్యా కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు, విద్యార్థినులకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రమశిక్షణ, పట్టుదలతో లక్ష్యాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు.

దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle

Next Story