Srikalahasti: అప్పుడే జన్మించిన మగ శిశువు లభ్యం పోలీసుల రక్షణ!

Srikalahasti: శ్రీకాళహస్తి మహిళా హాస్టల్ వద్ద వదిలేసిన అప్పుడే జన్మించిన మగ శిశువు రక్షణ. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న II టౌన్ పోలీసులు.

S.K.MAIDHEEN, SRIKALAHASTI
Published on: 17 Aug 2026 10:23 AM IST
Srikalahasti
X

Srikalahasti: అప్పుడే జన్మించిన మగ శిశువు లభ్యం పోలీసుల రక్షణ!

Srikalahasti: శ్రీకాళహస్తిలో అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ రోజు ఉదయం సుమారు 06:30 గంటల సమయంలో శ్రీకాళహస్తి ప్రభుత్వ మహిళా హాస్టల్ వెనుక వైపున ఉన్న సెప్టిక్ ట్యాంక్ సమీపంలో అప్పుడే జన్మించిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది.

సమాచారం అందుకున్న వెంటనే శ్రీకాళహస్తి II టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మరియు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్ సహాయంతో శిశువును సురక్షితంగా బయటకు తీసి, వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి బాగుందని పోలీసులు తెలిపారు.

శిశువును అక్కడ ఎవరు వదిలివెళ్లారు? ఏ పరిస్థితుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది? అనే అంశాలపై శ్రీకాళహస్తి II టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలోని పరిస్థితులు, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

S.K.MAIDHEEN, SRIKALAHASTI

S.K.MAIDHEEN, SRIKALAHASTI

Next Story