Madanapalle: జనసేన నాయకుడు ప్రదీప్ సింగ్‌కు అడపా సురేంద్ర శుభాకాంక్షలు
Madanapalle: రాజంపేట పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బృందంలో స్థానం పొందిన జనసేన నాయకుడు సోలంకి ప్రదీప్ సింగ్‌కు అడపా సురేంద్ర శుభాకాంక్షలు.
Madanapalle: జనసేన నాయకుడు ప్రదీప్ సింగ్‌కు అడపా సురేంద్ర శుభాకాంక్షలు
మదనపల్లె: మదనపల్లె నియోజకవర్గం నిమ్మలపల్లి జనసేన పార్టీ మండల అధ్యక్షులు సోలంకి ప్రదీప్ సింగ్‌కు రాజంపేట పార్లమెంట్ పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయ బృందంలో కీలక బాధ్యత లభించడం పట్ల రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అడపా సురేంద్ర మాట్లాడుతూ.. పార్టీ పట్ల నిబద్ధతతో, క్రమశిక్షణతో పనిచేస్తున్న ప్రదీప్ సింగ్‌కు కీలక బాధ్యత అప్పగించడం అభినందనీయమన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమన్వయంతో కృషి చేసి, జనసేన పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కోరుతూ ప్రదీప్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story




