Kuppam: కుప్పంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
Kuppam: చిత్తూరు జిల్లా కుప్పంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం. MFC ప్రభుత్వ జూనియర్ వృత్తి కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు.
Kuppam: కుప్పంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం!
Kuppam: కుప్పంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం. కుప్పం MFC ప్రభుత్వ జూనియర్ వృత్తి కళాశాలలో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ. 4 జడ్పీటీసీ, 56 ఎంపీటీసీ స్థానాలకు వెలువడనున్న ఫలితాలు. నియోజకవర్గవ్యాప్తంగా 1,88,887 మంది ఓటర్లకు గాను 1,46,306 మంది ఓటు హక్కు వినియోగం.
77.46 శాతం పోలింగ్ నమోదు. కుప్పం నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపునకు అధికార యంత్రాంగం సన్నద్ధం. కుప్పం మండలంలో 21 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్. గుడుపల్లి మండలంలో 13 ఎంపీటీసీ స్థానాల ఫలితాలపై ఉత్కంఠ. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు. రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 14 ఏకగ్రీవం.
మిగిలిన రెండు ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఓట్ల లెక్కింపు. నాలుగు మండలాల పరిధిలో అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్న ఓట్ల లెక్కింపు. కౌంటింగ్ కేంద్రం వద్ద రాజకీయ పార్టీల అభ్యర్థులు, నాయకుల్లో ఉత్కంఠ. మరికొద్ది గంటల్లో తేలనున్న అభ్యర్థుల గెలుపోటములు.




