Chittoor: చిత్తూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Chittoor: చిత్తూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పీవీకేఎన్ కాలేజీలో తెలిపారు.

Chandra Sekhar, Chittoor
Published on: 31 Oct 2026 9:25 PM IST
Chittoor
X

Chittoor: చిత్తూరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో నవంబర్ 1న జరగనున్న నగరపాలక, మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు.ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శనివారం చిత్తూరులోని ప్రభుత్వ పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బందికి రెండుసార్లు శిక్షణ ఇచ్చామని, అవసరమైన సామగ్రితో పాటు రూట్ అధికారులను కూడా ఏర్పాటు చేశామన్నారు.నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేస్తామని వెల్లడించారు

చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లకు గాను 51 డివిజన్లు ఏకగ్రీవం కాగా, మిగిలిన 9 డివిజన్లలో పోలింగ్ జరగనుంది. మేయర్ పదవికి ఆరుగురు పోటీలో ఉన్నారు. చిత్తూరు నగరంలో 1,48,583 మంది ఓటర్లు ఉండగా, 175 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.నవంబర్ 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు సి. సదానందం, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేష్, ఆర్వో పుల్లారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Chandra Sekhar, Chittoor

Chandra Sekhar, Chittoor