Chittoor: చిత్తూరు 24వ డివిజన్ కూటమి అభ్యర్థిగా గోపీనాథ్ నామినేషన్!
Chittoor: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కూటమి తరఫున గోపీనాథ్ నామినేషన్ దాఖలు చేసి, విజయంపై ధీమా వ్యక్తం చేశారు.
Chittoor: చిత్తూరు 24వ డివిజన్ కూటమి అభ్యర్థిగా గోపీనాథ్ నామినేషన్!
చిత్తూరు: చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 24వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా కూటమి పార్టీ తరఫున గోపీనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. 24వ డివిజన్ ప్రజలు తనను కార్పొరేటర్గా గెలిపిస్తే, డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, స్థానిక సమస్యల పరిష్కారానికి శ్రమిస్తానని గోపీనాథ్ పేర్కొన్నారు.




