Madanapalle: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర బర్త్‌డే వేడుకలు
Madanapalle: మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లిలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
Madanapalle: జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర బర్త్‌డే వేడుకలు
మదనపల్లె, జూలై 6: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లి సర్కిల్‌లో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
నిమ్మనపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు సోలంకి ప్రదీప్ ఆధ్వర్యంలో నిమ్మనపల్లి సర్కిల్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి అడపా సురేంద్రకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అడపా సురేంద్ర చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తానేశ్వర్, నరేంద్ర, అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Next Story




