Madanapalle: తట్టివారిపల్లి ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి చలపతి విజయం!

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం తట్టివారిపల్లి ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి చలపతి 495 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నాయకులు, శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 7 Nov 2026 9:20 PM IST
Madanapalle
X

Madanapalle: తట్టివారిపల్లి ఎంపీటీసీగా వైసీపీ అభ్యర్థి చలపతి విజయం!

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం తట్టివారిపల్లి పంచాయతీ ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చలపతి 495 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ విజయానికి మండల వైసీపీ యూత్ వింగ్ అధ్యక్షులు తట్టి హరికృష్ణ రెడ్డి విశేషంగా సహకరించారు.

ఈ సందర్భంగా తట్టి హరికృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. తట్టివారిపల్లి ప్రజలు వైసీపీ అభ్యర్థి చలపతిపై నమ్మకంతో ఓటు వేసి అఖండ విజయాన్ని అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ చలపతి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle