Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్లకు సిఫారసులే దిక్కా?

Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్ల కోసం గంటల తరబడి వేచి ఉన్నా పనులు జరగడం లేదని, సిఫారసులు ఉంటేనే పనులు అవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 24 Nov 2026 1:43 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్లకు సిఫారసులే దిక్కా?

మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్ల కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్త బర్త్ సర్టిఫికెట్లు పొందడంతో పాటు ఇప్పటికే ఉన్న సర్టిఫికెట్లలో పేర్ల సవరణ (నేమ్ కరెక్షన్) చేయించుకోవడానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోతున్నారు.

సర్టిఫికెట్ల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉన్నప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్లు పొందాలన్నా, పేర్లలో తప్పులను సరిచేయించుకోవాలన్నా సిఫారసులు, రికమండేషన్లు ఉంటేనే పనులు జరుగుతున్నాయా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అత్యవసర అవసరాల కోసం సర్టిఫికెట్లు పొందాల్సిన వారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాల్సిన వారు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవలు ఎలాంటి సిఫారసులు లేకుండా పారదర్శకంగా అందించాల్సి ఉండగా, గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఎందుకు ఏర్పడుతోందని ప్రశ్నిస్తున్నారు.

మున్సిపల్ అధికారులు స్పందించి కొత్త బర్త్ సర్టిఫికెట్ల జారీతో పాటు నేమ్ కరెక్షన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికీ సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. సామాన్యుల సమస్యలపై మున్సిపల్ ఉన్నతాధికారులు దృష్టి సారించి, ప్రజలకు సకాలంలో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle