Ramasamudram: అరికెల సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున రమణారెడ్డి

Ramasamudram: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం అరికెల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున రమణారెడ్డి ఎన్నికల బరిలో నిలిచి గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 26 Nov 2026 5:54 PM IST
Ramasamudram
X

Ramasamudram: అరికెల సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున రమణారెడ్డి

రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం అరికెల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున రమణారెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామ ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందడమే లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రతి ఒక్కరి సమస్యను తన సమస్యగా భావించి పనిచేస్తానన్నారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే అరికెల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రమణారెడ్డి కోరారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle