Punganur: పుంగనూరులో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకస్మిక తనిఖీలు!

Punganur: పుంగనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి. నగిరి వీధి పోలింగ్ కేంద్రం మార్పును కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి.

MAHESH, PUNGANOOR
Published on: 13 Oct 2026 8:18 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆకస్మిక తనిఖీలు!

పుంగనూరు: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం పుంగనూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించి, పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్‌లు, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంతంగా జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పిస్తామని స్పష్టం చేశారు. అలాగే, నగిరి వీధిలోని పోలింగ్ కేంద్రం మార్పు అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR