Madanapalle: విజయనగరం పోటీలకు అన్నమయ్య జిల్లా క్రీడాకారులు రవాణా!
Madanapalle: విజయనగరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు బయలుదేరిన అన్నమయ్య జిల్లా వాలీబాల్, అథ్లెటిక్స్ జట్లు.
Madanapalle: విజయనగరం పోటీలకు అన్నమయ్య జిల్లా క్రీడాకారులు రవాణా!
Madanapalle: అన్నమయ్య జిల్లా స్పోర్ట్స్ కౌన్సిల్ తరఫున వాలీబాల్ మరియు అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనడానికి విజయనగరం వెళ్లనున్న జట్టు సభ్యులకు జెర్సీలను సూపరింటెండెంట్ ఇంజనీర్ సోమశేఖర్ రెడ్డి, చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లా కీర్తిని రాష్ట్ర స్థాయిలో చాటాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మదనపల్లె ఈఆర్ఓ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ బర్నబాస్ కెనడి పాల్గొన్నారు. ఇంచార్జ్ స్పోర్ట్స్ సెక్రటరీ గురు భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులు పాల్గొన్నారు.
విజయనగరం పోటీల్లో అన్నమయ్య జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.
Next Story




