Madanapalle: నిమ్మనపల్లె జెడ్పీటీసీగా టీడీపీ నేత మునిరత్నం నామినేషన్!
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా టీడీపీ సీనియర్ నేత మునిరత్నం శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.
Madanapalle: నిమ్మనపల్లె జెడ్పీటీసీగా టీడీపీ నేత మునిరత్నం నామినేషన్!
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండల జడ్పీటీసీ స్థానానికి టీడీపీ సీనియర్ నాయకుడు మునిరత్నం నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం నిమ్మనపల్లె రోడ్డులోని జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ల కేంద్రంలో ఆయన నామినేషన్ సమర్పించారు.
ఈ సందర్భంగా మునిరత్నం మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం తనకు జడ్పీటీసీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.




