Ramasamudram: ఒక్క అవకాశం ఇవ్వండి.. రామసముద్రం రూపురేఖలు మారుస్తా!
Ramasamudram: అన్నమయ్య జిల్లా రామసముద్రం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే గ్రామ రూపురేఖలు మారుస్తానని కూటమి టీడీపీ అభ్యర్థి తలారి పవన్ కుమార్ అన్నారు.
Ramasamudram: ఒక్క అవకాశం ఇవ్వండి.. రామసముద్రం రూపురేఖలు మారుస్తా!
రామసముద్రం: అన్నమయ్య జిల్లా రామసముద్రం గ్రామపంచాయతీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలు తనను ఆదరించి సర్పంచ్‌గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని రామసముద్రం గ్రామపంచాయతీ కూటమి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అభ్యర్థి తలారి పవన్ కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, వీధిలైట్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని పేర్కొన్నారు. స్వార్థం లేకుండా గ్రామ ప్రజలకు సేవ చేస్తూ, రామసముద్రం గ్రామపంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడమే తన ఆశయమన్నారు. కావున గ్రామ ప్రజలందరూ తనను ఆదరించి, ఆశీర్వదించి సర్పంచ్‌గా గెలిపించాలని తలారి పవన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.




